Janaki Kalaganaledu serial September 27 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జానకి జెస్సి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో జానకి జెస్సికి ఉండ్రాళ్ల పండుగ గొప్పదనం గురించి విశిష్టత గురించి చెప్పడంతో సరే అక్క అని అంటుంది జెస్సి. వారిద్దరి మాటలు జ్ఞానాంబ వింటూ ఉంటుంది. ఆ తర్వాత అక్క నేను కూడా మీతో పార్టీ కలిసి ఈ పూజ చేస్తాను అనడంతో సరే అని అంటుంది జానకి. అప్పుడు జానకి జెస్సి కి ఆ ఇంటి మర్యాదల గురించి పద్ధతుల గురించి చెబుతూ ఉంటుంది.
అప్పుడు జెస్సి జానకి మాటలకు సరే అక్క అలాగే నడుచుకుంటాను అక్క అని అంటుంది. వారి మాటలు వింటున్న మల్లికా ఎలా అయినా జ్ఞానాంబ తో జానకిని జెస్సీని తిట్టించాలి అని ప్లాన్ వేస్తుంది. మరుసటి రోజు ఉదయం జానకి వంటలు చేస్తూ ఉండగా జెస్సి కూడా వచ్చి వంటలు చేస్తూ ఉంటుంది.
ఇంతలోనే మల్లిక అక్కడికి వచ్చి ఎలా అయిన పుల్లలు పెట్టాలి అని చూస్తూ ఉంటుంది. ఉండ్రాల్లలో చక్కెరకు బదులుగా ఉప్పు వేయాలి అని ప్లాన్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోనే జ్ఞానాంబ అక్కడికి వచ్చి మలికను పిలిచి గట్టిగా అరుస్తుంది. అప్పుడు జెస్సి కి చీర చీర ను తీసుకొని వస్తుంది. అప్పుడు వారిద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
Janaki Kalaganaledu serial Sep 27 Today Episode : జెస్సీ చేసిన పనికి జ్ఞానంబ ఆగ్రహం..
మరొకవైపు రామచంద్ర ఇంట్లో అందరూ పూజకు ఏర్పాటులు చేస్తూ ఉంటారు. అప్పుడు మల్లికా తింటూ ఉండగా ఇంతలో గోవిందరాజులు అక్కడికి వచ్చి మల్లిక పై సెటైర్లు వేస్తాడు. అప్పుడు అఖిల్ కూడా సంతోషంగా పూజలో పాల్గొంటూ ఉండగా జ్ఞానాంబ కోపంగా చూస్తుంది. ఇంతలోనే జానకి జెస్సిని అందంగా ముస్తాబు చేసి అక్కడికి పిలుచుకుని వస్తుంది.
ఇంతలో పంతులుగారు అక్కడికి ఇచ్చి పూజను మొదలు పెడతారు. ఇంతలో ముత్తైదువులు వచ్చి అఖిల్ గురించి, జెస్సి గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మల్లిక పుల్లలు పెట్టాలి అని చూడగా జ్ఞానాంబ కోపంగా చూస్తుంది. అప్పుడు వచ్చిన వారు జెస్సిని అవమానించాలి అని చూస్తుండగా ఇంతలో జానకి వారందరిని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తుంది.
ఆ తర్వాత మల్లిక వెళ్లి లీలావతి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇంతలో నీలావతి ఎక్కడికి రావడంతో వాళ్ళిద్దరూ కలిసి మంచి ప్లాన్ వేస్తారు. ఇక మరోవైపు అందరూ కలిసి పూజలో కూర్చుంటారు. ఆ తర్వాత పూజలో పూజల నిమగ్నం అవ్వగా మల్లికా, లీలావతి మాత్రం ఎలా అయినా పూజ చెడగొట్టాలి అని ప్లాన్ వేస్తూ ఉంటారు.
అప్పుడు పూజారి చెప్పిన మాటలు విని జెస్సీ కాస్త తెలియనట్టుగా ప్రవర్తిస్తుంది. దాంతో జ్ఞానాంబ కోపంగా చూస్తూ ఉంటుంది. పూజారి గారు అలా చేయకూడదు అని నచ్చ చెబుతాడు. అప్పుడు లీలావతి కావాలనే పూజ చెడగొట్టాలి అని జ్ఞానాంబ రెచ్చగొడుతూ ఉంటుంది. ఇంటికి వచ్చిన ముత్తైదువులు తలా ఒక మాట జెస్సి ని అంటారు.
Read Also : Janaki Kalaganaledu: జ్ఞానాంబ,జెస్సీలను కలిపే ప్రయత్నంలో జానకి..మల్లిక పై సెటైర్లు వేసిన గోవిందరాజులు..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World