Guppedantha Manasu january 06 Today Episode : వసుధారపై సీరియస్ అయిన జగతి.. వసు మెడలో తాళి చూసి షాకైన రిషి?

Guppedantha Manasu january 06 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో రాజీవ్,వసుధార మెడలో ఉన్న తాళిబొట్టును తెంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార దగ్గరికి రావద్దు బావ వస్తే చంపేస్తాను అంటూ అక్కడే ఉన్న దీపాన్ని చేతిలోకి తీసుకుంటుంది. అప్పుడు రాజీవ్ వసు నా మాట విను ఆ చేతిలో దీపాన్ని పక్కకు పారే అని అంటాడు. అప్పుడు రాజీవ్ చేతిలో ఉన్న దీపాన్ని పట్టుకొని లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు రాజీవ్. అప్పుడు అల్లుడుగారు వసుని వదలండి అని సుమిత్ర మధ్యలో వచ్చి రాజీవ్ నీ పక్కకు నెట్టేస్తూ ఉండగా అప్పుడు కోపంతో రగిలిపోతున్న రాజీవ్ వసుధర చేతిలో ఉన్న దీపాన్ని లాక్కొని సుమిత్రని పొడుస్తాడు. తర్వాత ఏమీ తెలియనట్టుగా ఆ దీపాన్ని వసుధార చేతిలో పెట్టి వసు ఎంత పని చేశావు మామయ్య చూసారా వసుధార అత్తయ్య ను చంపేసింది అంటూ దొంగ నాటకాలు ఆడుతూ ఉంటాడు.

Advertisement
Guppedantha Manasu january 06 Today Episode
Guppedantha Manasu january 06 Today Episode

మరొకవైపు జగతి దంపతులు రిషి లాడ్జిలో జరిగిన విషయాలు తలచుకుని ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి మేడం వసుధార ఇలా ప్రవర్తిస్తోంది అనగా నాకు అదే అర్థం కావడం లేదు రిషి అనడంతో లేదు మేడం వసుధార వెనకాల ఏదో జరుగుతోంది. వసుధార ఇలా అసలు మాట్లాడదూ తనను ఎవరో బెదిరించారు అనుకుంటూ వసుధార కి ఫోన్ చేస్తాడు రిషి. మరొకవైపు వసుధారని పోలీసుల అరెస్టు చేయడంతో జైల్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే రిషి ఫోన్ చేయడంతో ఇందాక చెప్పాను కదా సార్ వీడే ఈ కథకు మొత్తం వాడే సార్ విలన్ అనడంతో వసుధర షాక్ అవుతుంది.

Advertisement

సరే నేను చూసుకుంటాను అంటూ పోలీస్ ఫోన్ లిఫ్ట్ చేసి వసుధర అనే అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నలను పంపడానికి చూసింది అరెస్టు చేసాము అనడంతో ఏం మాట్లాడుతున్నారు అంటూ రిషి ఫోన్ కట్ చేసి అక్కడి నుంచి బయలుదేరుతాడు. అప్పుడు రాజీవ్ అవకాశం దొరికింది కదా అని రిషి మీద లేనిపోనివన్నీ చెప్పి పోలీస్ ని రెచ్చగొడుతూ ఉంటాడు. వసుధార జరిగిన విషయాలు తెలుసుకునే కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. అమ్మాయి తినిందో లేదో ఫస్ట్ తినిపించండి మల్ల మాకు అది ఒక పెద్ద సమస్య అవుతుంది అనడంతో మా ఆవిడ చాలా మొండిది సార్ తొందరగా తినదు అని అంటాడు రాజీవ్.

Advertisement

అప్పుడు రాజీవ్ వసుధార దగ్గరికి వెళ్లి ఏంటి వసుధార ఇలా చేస్తున్నావు అలా కోపంగా చూడకు అంటూ దొంగ ప్రేమను చూపిస్తూ ఉంటాడు. అప్పుడు పక్కనే ఉన్న మహిళా కానిస్టేబుల్ రాజీవ్ మాటలు నిజం అని నమ్మి వసుధారని నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతుంది. దాంతో వసుధార మరింత బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే రిషి అక్కడికి వచ్చి వసుధారాని చూసి షాక్ అవుతాడు. అప్పుడు పోలీస్ ఎవరు నువ్వు అని అడగగా నాకు పేరు రిషేంద్ర భూషణ్ ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నాము అనడంతో ఇంతలో రాజీవ్ అక్కడికి వచ్చి ఇతని వల్లే సార్ వసుధార జైల్లో ఇరుక్కుంది అనగా కోపంతో కాలర్ పట్టుకుంటాడు.

Advertisement

ఇప్పుడు పోలీసు రిషి ని అరుస్తూ ఏంటయ్యా నువ్వు నా ముందే అతని పట్టుకుని బెదిరిస్తున్నావు అంటాడు. అప్పుడు రిషి వసుధార దగ్గరికి వెళ్లి ఏం జరుగుతోంది వసుధార అని అడగగా ముఖం చూపించకుండా అవతలికీ తిరిగి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే మహేంద్ర దంపతులు అక్కడికి వస్తారు. నువ్వేం భయపడకు వసుధార నేను నీకు ఉన్నాను నువ్వు ధైర్యంగా ఉండు అనడంతో సార్ ప్లీజ్ దయచేసి ఇక నుంచి వెళ్లిపోండి అంటుంది. వసుధార ప్లీజ్ వసుధార ఒక్కసారి నా వైపు తిరిగి చూడు వసుధార అనడంతో వసుధార ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు జగతి మహేంద్ర వాళ్ళు ఎంత అడిగినా కూడా వసుధార ఏం చెప్పకుండా మౌనంగా ఏడుస్తూ ఉంటుంది.

Advertisement

అప్పుడు రిషి ఏడుస్తూ నా వైపు తిరిగి చూడు మాట్లాడి వసుధారా ప్లీజ్ అని అనగా వెళ్లిపోండి సార్ అనడంతో వెంటనే రిషి నిన్ను విడిచి ఎలా వెళ్ళిపోతాను అనుకున్నావు అనగా నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అనుకోని ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటుంది వసు. అప్పుడు రిషి కోపంతో ఏం మాట్లాడుతున్నావు.. వెళ్లిపోండి వెళ్లిపోండి అంటున్నావు వెళ్లిపోవడానికి నేను ఇక్కడికి వచ్చానా అని సీరియస్ అవుతాడు. ఆ తర్వాత వసుధర మెడలో ఉన్న తాళిబొట్టును చూసి రిషి షాక్ అవుతాడు. అప్పుడు జగతి నువ్వే ఆ తాళిబొట్టు కట్టావా అని అడగగా నాకు ఆ తాళిబొట్టుకి ఎటువంటి సంబంధం లేదు అంటాడు రిషి. దాంతో జగతి మహేంద్ర లు షాక్ అవుతారు. అప్పుడు ఎంతమంది ఎన్ని అడిగినా కూడా వసుధారి ఏం మాట్లాడకుండా మౌనంగా ఏడుస్తూ ఉంటుంది.

Advertisement

Read Also : Guppedantha Manasu: వసు ఇంటి నుంచి వెళ్లిపోయిన జగతి, మహేంద్ర.. వసు మెడలో తాళిబొట్టు చూసి షాకైన రాజీవ్?

Advertisement
Advertisement