Jabardasth venki: జబర్దస్త్ ప్రోగ్రాంలో కన్ఫ్యూజ్ స్కిట్స్ తో కడపుబ్బా నవ్వించే వెంకీ మంకీ గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ఆయనపై ఆయన వేసుకునే జోకులు, లేడీ గెటప్ లు చూస్తుంటే.. నవ్వాపుకోలేం. అయితే జబర్దస్త్ షోకు రాకముందు ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సింగరేణిలో కమ్యూనికేషన్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం వచ్చినా.. తాను వెళ్లనంటే చాలా మంది అతడిపై కోప్పడ్డారట. కానీ తనకంటూ ఇష్టమైన రంగంలో గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచనతోనే తాను సినీ రంగంలోకి రావాలనుకున్నాడట.
చమ్మక్ చంద్ర వల్లే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పాడు. అయితే తాను 45కు పైగా లేడీ గెటప్ లు వేశానని.. అది ఎంత కష్టమో తనకు తెల్సంటూ కామెంట్లు చేశాడు వెంకీ. ఎక్కువ మేకప్ వేస్కుని, విగ్, చీర పెట్టుకొని గంటల తరబడి ఉండటం చాలా కష్టమని చెప్పాడు. చీర కట్టుకొని నడవడమే కష్టం అనుకుంటే జంప్ లు, ఫైటింగ్, డ్యాన్సులు వేయడం మరింత కత్తి సాము చేయడం లాంటిదని వివరించాడు. కానీ జబర్దస్త్ వల్లే తాను చిన్నపాటి సెలబ్రిటీ అయిపోయానంటూ ఆనందం వ్యక్తం చేశాడు.