Jabardasth chalaki chanti : జబర్దస్త్ ప్రోగ్రాం గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అంతేనా అందులో చేసే ప్రతీ ఒక్క కమెడియన్ పేరు కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. అలాగే రొమాంటిక్ ట్రాకులు వేస్తేనే… టీఆర్పీ రేటింగ్ లు వస్తున్నాయని… తమకు రీచ్ వస్తుందని జబర్దస్త్ కంటెస్టెంట్లు కూడా ఫీలవుతున్నట్లున్నారు. అందుకే ఎవరో ఒకరిని తగులుకుంటూ… తమ మధ్య ఏదో ఉందని భ్రమ పడేలా చేస్తున్నారు. కలిసి స్కిట్లు వేస్తున్నారు. స్కిట్లు పండేందుకు రకరకాల వ్యయ ప్రయాసాలకు పోతున్నారు. ప్రోమోల్లో పడాలని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. ఇక ఈ మధ్య ఆది జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలోనే అజార్ ని టీం లీడర్ చేసేశారు. కానీ అజార్ మాత్రం ఆ రేంజ్ లో ఏం కామెడీని పండించట్లేడు. రీతూతో కలిపి పులిహోర కలుపుకుంటూ స్కిట్లు నడిచేలా చేస్తున్నాడంతే. అయితే అజార్ చేసే స్కిట్లు మరీ ఘోరంగా ఉన్నాయంటూ దారుణమైన కామెంట్లు వస్తున్నాయి. అయితే తాజాగా చలాకీ చంటి కూడా రీతూ, అజార్ మీద సెటైర్ వేశాడు. గత వారంలో అజార్, రీతూ కలిసి ఓ స్కిట్ వేశారు. స్కిట్ పూర్తి అయిన తర్వాత రోజూ అడిగిన ప్రశ్నకు రీతూ కాస్త ఓవర్ యాక్షన్ చేసింది.
అజార్ గురించి చెబుతూ రీతూ ఎమోషనల్ అయింది. చివరకు రీతూ.. అజార్ ను హగ్ చేసుకుంది. దీనిపై చలాకీ చంటి తన స్కిట్ లో కౌంటర్లు వేశాడు. రీతూ, అజార్ ని ఇమిటేట్ చేస్తూ… చలాకీ చంటి రెచ్చిపోయాడు. మొత్తానికి ఇలా తామే ఇమిటేషన్లు చేసుకుంటూ పరువు తీసేసుకుంటున్నారు.
Read Also : Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ అడ్డుపెట్టుకొని రష్మిపై సెటైర్లు వేసిన ఇమాన్యుయేల్.. వీడియో వైరల్!