...

Instagram Reels: ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారా… ఇకపై అలాంటివి కుదరవు.. అసలు విషయం ఏమిటంటే?

Instagram Reels:ఇంస్టాగ్రామ్ రీల్స్ ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ఇంస్టాగ్రామ్ రీల్స్ అనే సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురావడం వల్ల ఈ ఫీచర్ ద్వారా ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఒక రీల్ అయినా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయనిదే ఉండలేరు. ఇలా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇంస్టాగ్రామ్ రీల్స్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ విధంగా ఇంస్టాగ్రామ్ రీల్స్ కి ఇలాంటి క్రేజ్ వస్తుందని బహుశా నిర్వాహకులు కూడా ఊహించి ఉండరు.

ఈ విధంగా ఈ ఫీచర్ సహాయంతో ఎంతో మంది వారికి నచ్చిన సినిమా డైలాగులు, డాన్స్ వీడియోలను చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇతర దేశాలతో పోల్చి చూస్తే ఈ ఫీచర్ మన దేశంలో బాగా హిట్ అయింది. ఇలా ఈ ఫీచర్ ఇలా మంచి హిట్ అయిన తర్వాత ఈ కంపెనీ వాళ్లకు ప్రస్తుతం ఒక పెద్ద తలనొప్పి వచ్చి పడింది. ఇంతకీ ఏం జరిగింది అనే విషయానికి వస్తే కాపీ కంటెంట్ నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారింది.

ఇంస్టాగ్రామ్ రీల్ రాకముందు చాలామంది టిక్ టాక్ ద్వారా ఎన్నో వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే వారు. అయితే అదే వీడియోలను తీసుకువచ్చి ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ రీల్ లో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాపీ కంటెంట్ రావడంతో నిర్వాహకులు ఈ కాపీ కంటెంట్ అడ్డుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఇలా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఉచితంగా టిక్ టాక్ ప్రమోషన్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇన్ స్టా హెడ్ ఆడమ్ మోస్సేరి మాట్లాడుతూ.. తమ ప్లాట్ ఫామ్ ఇన్ స్టాలో రీల్స్ చేసే ఒరిజినల్ క్రియేటర్లకు మాత్రమే ఎక్కువ క్రెడిట్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో టిక్ టాక్ లో చేసిన వీడియోలను తీసుకువచ్చి ఇంస్టాగ్రామ్ రీల్స్ చేసే అవకాశం ఉండదు కనుక ప్రతి ఒక్క యూజర్ సరికొత్తగా ఇంస్టాగ్రామ్ రీల్స్ చేయాల్సి ఉంటుంది.