...

Keerthi Suresh: వారిద్దరితో కలిసి ఫోటో దిగిన కీర్తి సురేష్… ఫోటో వైరల్!

Keerthi Suresh:కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదటి సినిమాతోనే ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న కీర్తి సురేష్ వరుస అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటించే వాళ్ళు కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను మాత్రమే ఎంపిక చేసుకుంటారు. కానీ కీర్తి సురేష్ హీరోయిన్ గా మాత్రమే కాకుండా హీరో చెల్లెలి పాత్రలో కూడా నటిస్తూ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే వరుస తెలుగు తమిళ చిత్రాలతో ఎంతో బిజీగా గడుపుతున్న కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్ బాబు సర్కారీ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే విడుదల తేది దగ్గర పడటంతో పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఒకవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పనులను పూర్తి చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే కీర్తి సురేష్ ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులను పూర్తి చేసుకున్నారు. ఇకపోతే కీర్తిసురేష్ వ్యక్తిగత జీవితంలో అందరితో ఎంతో సరదాగా, అల్లరి అల్లరి చేస్తూ ఉంటారు. షూటింగ్ లొకేషన్ లో దర్శక నిర్మాతలతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఈమె సర్కారీ వారి పాట సినిమా డబ్బింగ్ పనులలో భాగంగా దర్శకుడు పరశురామ్,సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ తో కలిసి డబ్బింగ్ స్టూడియోలో ఫోటోకి ఫోజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.