Indraja comments: బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ షో ప్రారంభం అయినప్పటి నుంచి రోజా, నాగబాబులు జడ్జిలుగా వ్యవహరించారు. అయితే వీరిద్దరిలో ఎవరికైనా ఇతర పనులు ఉంటే… అప్పటికి అందుబాటులో ఉన్న ఎవరో ఒకర్ని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టేవారు. అయితే మనో లాంటి చాలా మంది జడ్జిలుగా వచ్చి ఎక్కువ కాలం ఉండలేకపోయారు. వీరందరితో పోలిస్తే.. అలా వచ్చి ఎక్కువ కాలం జడ్జిగా కొనసాగింది ఇంద్రజనే. అయితే రోజా మంత్రి అయి వెళ్లిపోయినప్పటి నుంచి ఇంద్రజ సందడి పెరిగింది. అయితే తాజాగా ఇంద్రజ రోజాపై పలు ఆసక్తికర కామెంట్లు చేసింది.
రోజాకు మంత్రిగా అవకాశం రాకూడదని ఇంద్రజ ఆ భగవంతుడిని ప్రార్థించిందట. ఈ విషయాన్ని తాజాగా ఆటో రాం ప్రసాద్ బయట పెట్టారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఒప్పుకున్నారు. అవునూ రోజా వస్తే.. జబర్దస్త్ సీటు నుంచి తాను లేచి వెళ్లిపోతానని మరో సారి స్పష్టం చేశారు. ఇప్పుడు మాత్రమే కాదు.. ఎప్పుడైనా, ఏ వేదిక మీదనైనా తాను ఇదే మాట చెపుతాననంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇంద్రజ జబర్దస్త్ తో పాటు, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ కు కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు.