Horoscope: 2022వ సంవత్సరం జూన్ నెలలో ధనస్సు రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే ధనస్సు రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైనాన్స్ విషయంలో చక్కటి పురోగతి ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నించే వారికి రుణాలు దొరుకుతాయి. బ్యాంకు, మార్కెటింగ్, ఫ్యాషన్ డిజైనిగ్ ఉద్యోగాల్లో చాలా లాబాలు ఉండబోతున్నాయి. సంతానం కోసం ప్రయత్నించే వాళ్లు ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైతే ఈ నెలలో పిల్లల కోసం ప్లాన్ చేసుకోకపోవడమే మంచిది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కచ్చితంగా ఈ మాసంలో పెళ్లి కుదురుతుంది. విద్యార్థులు కాస్త కష్టపడి చదివినా మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఉద్యోగాలను కూడా సులువుగా సంపాదిస్తారు.
రాజకీయంగా మీరు చేస్తున్న ప్రయత్నాల్లో కూడా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఏమాత్రం ఏమర పాటు వ్యవహరించిన మీరు రాజకీయ రంగాలకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల్లో గాసిప్స్ మూలంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. సోదరసోదరీమణుల మధ్య గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి జాగ్రత్త. దుర్గాదేవిని స్తుతించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ప్రతీ రోజూ ఉదయం స్నానం చేసిన వెంటనే దేవుడి గది ముందు కూర్చొని అమ్మవారిని స్తుతించండి.