Manchu Family: మంచు ఫ్యామిలీతో నటిస్తే.. హీరోయిన్ల గతి అంతేనా!

Manchu Family: మంచు ఫ్యామిలీ హీరోలతో నటిస్తే కెరియర్ మటాషేనా అంటూ నెటిజెన్లు కామెంట్లు మీద కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫ్యామిలీ హీరోలెవరో కాదు.. మంచు వాళ్లేనట. వారి సరసన హీరోయిన్ గా నటిస్తే.. ఈ హీరోయిన్ కు కెరియర్ ఉండదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మంచు విష్ణు హీరోగా నటించిన సినిమాల్లో హీరోయిన్ గా పార్వతీ మెల్టన్, లావణ్య త్రిపాఠి, హన్సిక మెత్వానీ లాంటి వారున్నారు. వీరు ఇప్పుడు తెలుగులో పెద్దగా రాణించడం లేదు. అయితే పార్వతీ మెల్టన్ కొన్ని సినిమాలు చేసినా ఆమె హీరోయిన్ గా మాత్రం సక్సెస్ సాధించలేకపోయింది. ఆ లెక్కన చూస్తే.. మంచు విష్ణు సరసన నటించడం వల్ల ఆమె కెరీర్ నానం అయిందని చెబుతున్నారు.

Advertisement

అలాగే లావణ్య త్రిపాఠి కెరియర్ చూస్తే విష్ణు సరసన కెరియర్ ప్రారంభంలో దూసుకెళ్తా లాంటి హిట్ సినిమాలో నటించింది. ఆమె తెలుగులో అందుకున్న హిట్స్ లో మంచు విష్ణు సినిమా కూడా ఉంది. నాగార్జున సరసన సోగ్గాడే చిన్ని నాయనా, నాని సరసన భలే భలే మగాడివోయ్ లాంటి సూపర్ హిట్స్ చేసి క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత కెరియర్ మలుపు తిరిగ సక్సెస్ లకు దూరం అయింది. అలాగే హన్సిక కూడా అంతే. మిగతా హీరోల సరసన నటించి హిట్స్ అందుకుంది. కానీ ఇక మంచు హీరోలతో కలిసి నటించి తర్వాత కనుమరుగైపోయింది. వీళ్లలాగే షీలా, తమన్నా, రెజీనా లాంటి వాళ్లు మంచు మనోజ్ సరసన నటించి.. ఆ తర్వాత కొద్ది కాలానికే తెరమరుగైపోయారు.

Advertisement