Rakhi sawant: మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ వల్ల తన జీవింత నాశనం అయిందంటూ బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ షాకింగ్ కామెంట్లు చేశారు. బూస్టర్ డోసు తీసుకున్నప్పటి నుంచి తన పలు రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మూడో డోసు టీకా తీసుకున్నప్పటి నుంచి నిద్ర కూడా సరిగ్గా పోలేకపోతున్నానని, ఇందుకు ప్రధానీ మోదీ కారణం అని తెలిపింది. “నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. అలసిపోయారు. ముఖం ఉబ్బుగా మారింది. అరగంట కూడా నిద్ర పోలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది. బూస్టర్ డోస్ కేవలం సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఇవ్వాలి” అని బాలీవుడ్ హీరోయిన్ రాఖీ సావంత్ తెలిపింది.
రాఖీ సావంత్ మోడల్ గా తన కెరియర్ ను ప్రారంభించి బుల్లితెర వ్యాఖ్యాతగా కొనసాగారు. ఆ తర్వాత నటిగా, డ్యాన్సర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. బాలీవుడ్ తో పాటు దక్షణాదిలోనూ ప్రేక్షకుల్ని అలరించారు. ఓ ఎన్నారైతో తను పెళ్లి చేసుకుంది. అయితే ఆమె గతేడాది బిగ్ బాస్ షో వేదికగా తన భర్త రతేష్ సింగ్ ను అందరికీ పరిచయయం చేసింది. ఈ ఏడాది జులైన తన ఏడేళ్ల వైవాహికి బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించింది. తన భర్తకు, తనకు మధ్య విబేఘాల కారణంగా తాము విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించింది.