Raviteja accident: మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నారు. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఈయన… జయాపజయాలను లెక్క చేయకుండా ముందుకు వెళ్తున్నారు. అయితే తాజాగా ఆయన ఓ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. తీవ్ర గాయాలతో రవితేజ చాలా ఇబ్బంది పడుతున్నారని తెలియడంతో… అభిమానులు తెగ కంగారు పడిపోతున్నారు. టైగర్ నాగేశ్వర రావు సినిమా షూటింగ్ చేస్తుండగానే మాస్ మహారాజకు ప్రమాదం జరిగిందని సమాచారం. అయతే ప్రమాదం జరిగి రెండు రోజులు గడుస్తున్నా… ఈ విషయాన్ని బయటకు తెలియకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడ్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి.
ప్రమాదం జరిగిన వెంటనే రవితేజను ఆసుపత్రికి తరలించారట. గాయాలు ఎక్కువవడంతో 10 కుట్లు కూడా పడ్డాయట. ఇంత జరిగినా ఆయన విశ్రాంతి తీస్కోకుండా రవితేజ షూటింగ్ కు హాజరవుతున్నారట. సినిమాలోని యాక్షన్ సీన్స్ షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారట. స్టంట్ మాస్టర్ పీటల్ హెయిన్స్ డేట్స్ ఎక్కువగా అందుబాటులో లేకపోవడంతో… ఇప్పుడే యాక్షన్ సీన్స్ ను పూర్తి చేయాలని రవితేజ డిసైడ్ అయ్యారట. ఇదిలా ఉండగా.. రవితేజ హీరోగా తెరకెక్కి విడుదలకు సిద్ధంగా ఉన్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వ్లల వాయిదా పడింది.