Hebba patel: బుల్లితెర మీద శ్రీదేవి డ్రామా కంపెనీ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఒకపపుడు జబర్దస్త్ ప్రోగ్రాం ఎంతగా హిట్ అయ్యిందో… ఇప్పుడు శ్రీ దేవి డ్రామా కంపెనీ కూడా అదే రేంజ్ లో దూసుకెళ్తుంది. అయితే జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి దాదాపు అందర్నీ తీసుకొచ్చి శ్రీ దేవి డ్రామా కంపెనీలో సందడి చేయుస్తున్నారు మల్లెమాల నిర్వాహకులు. వారానికి ఒకసారి ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ లో ప్రతివారం ఎవరో ఒక గెస్ట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ వరం హెబ్బా పటేల్ గెస్ట్ గా రాగా… ఆమెతో సందడి చేయించారు నిర్వాహకులు.
ఇందులో భాగంగానే శ్రీదేవి డ్రామా కంపెనీకు చెందిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమో ప్రకారం 29వ తేదీ విడుదల కాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో హెబ్బా పటేల్ ముఖ్య అతిధిగా హాజరైంది. ఈ క్రమంలోనే సుధరీర్ మాట్లాడుతూ.. నేను హీరోగా యాక్టింగ్ చేస్తే.. మీరు హీరోయిన్ గా చేయాలని అడుగుతాడు. ఆమెకి ఇష్టం లేదని అనగానే… అదేం లేదంటూ సుధీర్ కు ప్లయింగ్ కిస్ ఇస్తుంది.
ఆ తర్వాత హైపర్ ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ కూడా హెబ్బా పటేల్ ను అడిపించే ప్రయత్నం చేయగా… వెంటే హైపర్ ఆది వసతాడు. ప్రోగ్రాం కి రాగానే ముందుగా బావలకు హగ్ ఇవ్వాలంటూ చెప్పగా.. హెబ్బా ఆదికి హగ్ ఇస్తుంది. అయితే ఈ ప్రోమో చూసిన ప్రతీ ఒక్కరూ హెబ్బా అస్సల్ ఆగట్లేదు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.