...

Viral Video: వేదికపై వధువును ఆటపట్టించిన వరుడు స్నేహితులు.. వధువు చేసిన పనికి షాక్ అయిన అతిథులు?

Viral Video: ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే పెళ్లిలో వధూవరుల మధ్య జరిగే సరదా సన్నివేశాలు సంఘటనలు కూడా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అలాగే వేదికపై వధూవరుల మధ్య కొన్ని గొడవలు కొట్లాటలకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పెళ్లి అంటేనే బంధువులు స్నేహితులు హడావిడి ఎంతో ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిలో స్నేహితులు చేసే హడావిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తాజాగా ఒక పెళ్లికి సంబంధించిన వీడియోలో భాగంగా వరుడు స్నేహితులు ఎంతో ఆట పట్టించారు. అయితే వధువు కూడా ఏ మాత్రం తగ్గేదే లే అంటూ వరుడు అతని స్నేహితులకు గట్టి షాకిచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే… వేదికపై వధూవరులిద్దరు నిలబడి ఉండగా.. వధువు పూలమాల తీసుకొని వరుడి మెడలో వేయడానికి వెళ్ళింది. దీంతో వరుడు స్నేహితులు తనని ఒక్కసారిగా పైకి ఎత్తి ఇప్పుడు తన మెడలో పూలమాల వేయాలని వదువుకు సూచించారు.

వరుడు చాలా ఎత్తులో ఉండటంతో వధువుకు తన మెడలో పూలమాల వేయడం సాధ్యపడలేదు. దీంతో చేసేదేమీ లేక వధువు మీరు ఎంత సేపు అలాగే తనని పైన ఎత్తుకుంటారో మీ ఇష్టం అని చెప్పి అక్కడినుంచి కోపంగా వెళ్లి సోఫాలో కూర్చున్నారు. ఇక వరుడు స్నేహితులు ఎక్కువ సేపు ఎత్తుకోలేక కిందికి దించారు. ఈ విధంగా వధువు చేసిన ఈ పనికి స్నేహితులు తిరిగి తన దగ్గర దింపారు. దీంతో వధూవరులిద్దరు ఎంచక్కా పూలమాలలు వేసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఏదిఏమైనా ఈ పెళ్లి మండపంలో వధువు చేసిన ఈ తెలివైన పనికి వరుడు స్నేహితులతో పాటు బంధువులు కూడా ఆశ్చర్యపోయారు.