Maa robot: అతనో దినసరి కూలీ. రోజూ పనికి వెళ్తూన భార్యా, కూతురును పోశిస్తుంటాడు. అయితే కూతురు దివ్యాంగురాలు. గత రెండేళ్ల క్రితం భార్య అనారోగ్యం పాలై మంచాన పడింది. ఓ వైపు దివ్యాంగురాలైన కూతురు, మరోవైపు ఆరోగ్యం బాగాలేని భార్య.. వీరిద్దరిని చూసుకుంటేనే డబ్బులు సంపాదించాలి. ఇందుకోసం అతడు చాలా కష్టపడుతున్నాడు. పాపకి తినిపించేందుకు ఎవరూ లేక నానా తంటాలు పడుతున్నాడు. విషయం గుర్తించిన ఆ తండ్రి పాపకు మధ్యాహ్నం అన్నం పెట్టడం కోసం ఏదైనా రోబోట్ తయారు చేయాలనుకున్నాడు. ఆయనకు దాని గురించి ఏం తెలియకపోయినా రీసర్చ్ చేసి మరీ ఓ అద్భుతమైన రోబోను ఆవిష్కరించాడు. ఏం కూర కావాలో చెప్తే చాలు.. ఆదే ఆ కూరని కలిపి పాపకు తనిపిస్తుంది. అయితే ఇదెక్కడ, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దక్షిణ గోవాలోని పొండా తాలుకాబి బితోరా గ్రామానికి చెందిన బిపిన్ కదమ్ (40) దినసరి కూలీ. అతడికి భార్య, దివ్యాంగురాలైన కూతరు ఉన్నారు. భార్య కూడా మంచాన పడడంతో పాపకి అన్నం పెట్టే దిక్కులేకుండా పోయింది. దీంతో అతడు పాప కోసం కూలీ పనికి వెళ్లి వచ్చిన తర్వాత రోబో తయారు చేయడం ప్రారంభించాడు. అతి త్వరలోనే మా రోబోను తయారు చేసి ఆదర్శంగా నిలిచాడు. అయితే ఈ ఆవిష్కరణను గోవా స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ప్రశంసించింది. మా రోబోను వాణిజ్య పరంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ఆర్థిక సాయాన్ని కూడా కదమ్ కు అందిస్తోంది.