Viral video : సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. చాలా వీడియోలు బాగా ఆకట్టుకుంటాయి. కొందరు తమ అందచందాలు చూపిస్తూ ఫాలోవర్స్ ను అలరిస్తారు. చిట్టి పొట్టి బట్టలు వేసుకుని అందచందాలు ఆరబోస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం చాలా పద్ధతిగా చీర కట్టులోనో లేదా లంగా వోణీలోనో కనిపిస్తూ అలరిస్తుంటారు. ప్రస్తుతం ఓ అమ్మాయి చేసిన డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక యువతి వినూత్నమైన డ్యాన్స చేసింది. కొంచెం క్లాసికల్ గా ఇంకొంచెం మాస్ డ్యాన్స్ ని యాడ్ చేసింది ఈ అమ్మాయి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అతడు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని అన్ని పాటలు ఎంతో హిట్ సాధించాయి. చాలా పాటలు ఇప్పటికీ వినే కొద్దీ వినాలనిపిస్తుంది. అందులోకి ఒక పాటనే పిల్లగాలి అల్లరి ఒళ్లంతా గిల్లి. ఈ పాటలో త్రిష నటన సూపర్బ్ అనే చెప్పాలి. త్రిష నటనకు మంచి మార్కులే పడ్డాయి.
పిల్లగాలి అల్లరి ఒళ్లంతా గిల్లి పాటకు ఈ అమ్మాయి డ్యాన్స్ చేసింది. సూపర్ డ్యాన్స్ తో పాటు మంచి ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ తో దుమ్ము రేపింది. లంగా వోణిలో పిల్లగాలి అల్లరి పాటకు ఈ అమ్మాయి చేసిన క్యూట్ వీడియో ఇప్పుడు ఎంతో మందిని అలరిస్తోంది. చూడగానే ముచ్చటేస్తోంది.
View this post on Instagram