Bigg Boss Ott Telugu : బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ క్రమంలోనే మరికాసేపట్లో ఈ కార్యక్రమానికి విజేత ఎవరు అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే బిందుమాధవి విజేత అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొదటినుంచి టాప్ పొజిషన్ లోనే ఉన్నటువంటి బిందు మాధవి ఈసారి టైటిల్ గెలుచుకుంది. బిగ్ బాస్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక అమ్మాయి టైటిల్ గెలుచుకోవడం ఇదే మొదటిసారి.

Bigg Boss Ott Telugu
ఇకపోతే ఈ కార్యక్రమం 17 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభం కాగా బాబా భాస్కర్ మాస్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే ఈ కార్యక్రమం నుంచి వరుసగా ముమైత్ ఖాన్, శ్రీ రాపాక, సరయు, ఆర్జే చైతు, మహేష్ విట్టా, తేజస్వి, స్రవంతి, అజయ్, హమీదా, ఆశు రెడ్డి, నటరాజ్ మాస్టర్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ఇక గ్రాండ్ ఫినాలేకి అనిల్, అరియాన అఖిల్, మిత్ర, బాబా, శివ, బిందు మాధవి ఫినాలేలోకి చేరుకున్నారు. ఇక గ్రాండ్ ఫినాలే కార్యక్రమం ప్రస్తుతం ఎంతో ఘనంగా మొదలైంది.
ఈ కార్యక్రమానికి ఎఫ్ 3, మేజర్ చిత్రబృందం ముఖ్య అతిథులుగా పాల్గొనీ ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే గ్రాండ్ ఫినాలేలో భాగంగా చివరి నుంచి బాబా భాస్కర్, అనిల్ రాథోడ్, మిత్ర, అరియానా, శివ, అఖిల్, మాధవి ఉన్నారు. అయితే ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లతో పాటు టాప్ సెవెన్ లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు బిగ్ బాస్ వేదికపై ఆటపాటలతో సందడి చేశారు. ఇకపోతే అరియానా 10 లక్షల రూపాయల తీసుకొని స్వచ్ఛందంగా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
Read Also : Big Boss Ott Non Stop Telugu : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో సందడి చేసిన అతిథులు వీళ్లే?