Ginna Movie Review : మంచు విష్ణు నటించిన కొత్త మూవీ జిన్నా.. (Ginna Movie Review)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ రిలీజ్ చేయడానికి ముందే ప్రమోషన్ బాగా చేశారు. జిన్నా మూవీ ఎలా ఉండబోతుందనే క్యూరాసిటీ కలిగించే ప్రయత్నం చేశారు. అయితే మంచు అభిమానులు ఎదురుచూసినట్టుగానే జిన్నా మూవీ అక్టోబర్ 21న థియేటర్లలోకి రిలీజ్ అయింది. ఈ మూవీలో మంచు విష్ణు తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
విష్ణుపై సోషల్ మీడియాలో బాగా నెగటివిటీ ఉంది. ఆయనపై ఎక్కడలేని ట్రోల్స్, మీమ్స్ బాగా వస్తుంటాయి. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మంచు విష్ణు తనదైన శైలిలో సినిమాలతో కొత్తగా చూపించేందుకు ముందుకు వచ్చాడు. విష్ణు నటించిన జిన్నా ప్రేక్షకులకు ఆశించిన స్థాయిలో ఉందా? థియేటర్లకు వెళ్లి చూడదగిన మూవీనా కాదో తెలియాలంటే ఓసారి రివ్యూలోకి వెళ్లాల్సిందే.
స్టోరీ (Story) :
ఈ మూవీ స్టోరీ.. తిరుపతిలో మొదలవుతుంది. తిరుపతికి చెందిన జిన్నా ఒక టెంట్ హౌస్ రన్ చేస్తుంటాడు. స్నేహితులకు జిన్నా అండగా ఉంటారు. జిన్నా ఒక రౌడీ నుంచి కొంత అప్పు తీసుకుంటాడు. గడువు లోగా ఆ అప్పును జిన్నా తీర్చలేడు. ఆ రౌడీని తప్పించుకునేందుకు జిన్నా కనిపించకుండా పారిపోతాడు. చివరకు ఆ రౌడీకి జిన్నా దొరకుతాడు. అప్పు తీర్చేందుకు అతడే అవకాశం ఇస్తాడు. అందుకు ఒక కండీషన్ పెడతాడు. ఆ రౌడీ తన సోదరిని (సన్నీ లియోన్) పెళ్లి చేసుకోవాలంటాడు. మరో దారిలేక జిన్నా ఆ పెళ్లికి ఒప్పుకుంటాడు. ఆ సమయంలో విష్ణుకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులను జిన్నా ఎలా ఎదుర్కొన్నాడు అనేది తర్వాతి కథ..
నటీనటులు వీరే :
విష్ణు మంచు (జిన్నా), పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్, వెన్నెల కిషోర్, సద్దాం, నరేష్ ఈ మూవీలో నటించారు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించాడు. సంగీతం అనూప్ రూబెన్స్ అందించగా.. ఛాయాగ్రహణం ఛోటా కె. నాయుడు అందించాడు. ఆవా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మంచు విష్ణు ఈ మూవీని నిర్మించారు.
Movie Name : | Ginna (2022) |
Director : | సూర్య |
Cast : | విష్ణు మంచు, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్, వెన్నెల కిషోర్, సద్దాం, మరియు నరేష్ |
Producers : | విష్ణు మంచు |
Music : | అనూప్ రూబెన్స్ |
Release Date : | 21 అక్టోబర్ 2022 |
Ginna Movie Review : జిన్నా మూవీ ఎలా ఉందంటే? :
జిన్నా మూవీతో మంచు విష్ణు ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హార్రర్ కామెడీ జోనర్‌లో వచ్చిన ఈ మూవీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకున్నట్టు లేదు. కామెడీ పరంగా పర్వాలేదనిపించింది. ఒకరకంగా చెప్పాలంటే టీవీ స్ర్కిప్ట్ కామెడీ షో అనిపించింది. ఈ సినిమాలో హీరో ఎంట్రీ, పాటలు, స్నేహితులతో కామెడీ సీన్లు రొటీన్‌గా అనిపించాయి. అదే సమయంలో జిన్నా ఒక అమ్మాయితో ప్రేమలో పడటం వంటి చాలా సినిమాల్లో చూశాముగా అనిపించేలా ఉన్నాయి.
ఫస్ట్ హాఫ్‌లో కొంత కామెడీ సీన్లు నవ్వించేలా ఉన్నాయి. ఇక స్క్రీన్‌ప్లే చాలా పేలవంగా సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందనే ఆసక్తి కలిగిస్తుందని భావించారు. జానర్ కూడా పాతది కావడంతో ప్రేక్షకులకు ఎక్కడ కూడా ఆసక్తిని రేకిత్తించేలా ఉండదు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే.. హర్రర్ ఎలిమెంట్స్‌పైనే ఎక్కువగా చూపించారు. కామెడీ కూడా చాలా రొటీన్ సీన్లతో సాగింది. మధ్యమధ్యలో ఎమోషన్ సీన్లు కూడా పండలేదనే చెప్పాలి.
మంచు విష్ణు కామెడీ సీన్లలో ఎప్పటిలానే నటించాడు. అప్పట్లో ఢీ మూవీలో కామెడీని మళ్లీ గుర్తు చేశాడు. ఒక్క కామెడీతోనే ప్రేక్షకులను ఎక్కువ సమయం అలరించడం కష్టమే. ఇక మరో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ డిజైన్ స్కోప్ పెద్దగా ఇవ్వలేదు. ఆమె రోల్ కు ప్రత్యేకత ఏమి లేదు. సన్నీలియోన్ తన రొమాంటిక్ ఫిజిక్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇతర నటుల్లో వెన్నెల కిషోర్, సద్దాం, నరేష్ తమ పాత్రకు తగినట్టుగా నటించి మెప్పించారు.
కోన వెంకట్ స్టోరీ పాత చింతకాయ పచ్చడిలా అనిపించింది. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మూవీని తీయడంలో దర్శకుడు సూర్య పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. సాంకేతికపరంగా చూస్తే.. టెక్నికల్‌గా, జిన్నా మూవీ అంతగా ఆకట్టుకోలేదు. చోటా కె నాయుడు విజువల్స్ కూడా బాగోలేదు. పాటలు కూడా అంతగా ఆకట్టుకునేలా లేవు. ఓవరాల్ గా చూస్తే.. జిన్నా ఓ రోటీన్ హార్రర్ కామెడీ సినిమా.. ప్రేక్షకులు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారా అంటే చెప్పడం కష్టమే.. మంచు ఫ్యామిలీని అభిమానించే ఆడియెన్స్ ఈ మూవీని థియేటర్లలోకి వెళ్లి ఓసారి చూడొచ్చు.
[ Tufan9 Telugu News ]
జిన్నా మూవీ రివ్యూ & రేటింగ్ : 2.4/5
Read Also : Ori Devuda Movie Review : ‘ఓరి దేవుడా’ మూవీ రివ్యూ.. విశ్వక్ సేన్ సినిమా ఎలా ఉందంటే?