Guppedantha Manasu serial Oct 21 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవయాని మాటలకు మహేంద్ర పోతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని అయిన ఇదంతా మీ వల్లే వచ్చింది ఆ గురుదక్షిణ ఒప్పందం వల్ల రిషి వసుధారలను దూరం చేస్తున్నారు. వారి మధ్య దూరం పెరగడానికి కారణం కూడా మీరే కదా అని అంటుంది దేవయాని. తల్లిదండ్రులుగా మీరు రిషికి ఏమైనా చేశారా అని నిలదీస్తుంది. మీరు ఇంట్లో ఉన్నా లేనట్లే మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అని అక్కడి నుంచి దేవయాని కోపంతో వెళ్లిపోతుంది.
దేవయాని మాటలకు ఏం మాట్లాడాలో తెలియక జగతి దంపతులు బాధపడుతూ ఉంటారు. మరొకవైపు వసుధార, రిషి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడు వసుధార, రిషి ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. నీకు నాకు సంబంధం ఏంటి అని ఎవరైనా అడిగితే ఏం చెబుతావు అని రిషి అడగగా మీరు నేను, నేను మీరు సార్ మీరు నా సగభాగం అని అంటుంది వసు.
మరొకవైపు జగతిదంపతులు జరిగిన విషయం తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అప్పుడు రిషికి మహేంద్ర ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పుడు వారు మరింత బాధపడుతూ దేవయాని వదిన అన్నట్టుగా నిజంగానే మనం శత్రువులం అయిపోతున్నామా అని బాధపడుతూ ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటారు. మరొకవైపు రిషి వసదారలు రోడ్డు మీద ఒకచోట కూర్చుని ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు.
Guppedantha Manasu అక్టోబర్ 21 ఎపిసోడ్ : రిషి, వసుధార రొమాంటిక్ సీన్..
అప్పుడు చూసి నేను నీ దగ్గర ఉంటే మనసులో ఉన్న బాధంతా పోయి హాయిగా ఉంటుంది వసు అని అంటాడు. మన మధ్య ఎటువంటి డిస్టబెన్స్ ఉండకూడదు అని స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్లో టీ కారులో పెట్టాను అని అనగా రిషి వెనక్కి తిరగడంతో వసు,రిషి ఒడిలో పడగా ఇద్దరు ఒకరి వైపు మరొకరు చూసుకుంటూ ఉంటారు. మరొకవైపు జగతి దంపతులు బట్టలు సర్దుకుంటూ ఉంటారు.
దేవయాని అక్కయ్య అన్నట్టుగా ఇల్లు వదిలి వెళ్ళిపోదాము మన బంధాలకి మనకు ఎటువంటి సంబంధం ఉండదు అని బట్టలు సర్దుకుంటూ ఉండగా మహేంద్ర,రిషి ఫోటో చూసి బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత జగతిని తీసుకొని ఇల్లు వదిలి వెళ్లి కారులో కూర్చుంటారు. అదంతా చూస్తున్న దేవయాని ఏం మాట్లాడకుండా ఆనందపడుతూ ఉంటుంది.మరోవైపు రిషి వసుధారలు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు.
అప్పుడు వసు వచ్చిన తర్వాత తన లైఫ్ లో జరిగిన విషయాల గురించి చెబుతూ ఉంటాడు రిషి. అప్పుడు వసు,జగతి గురించి టాపిక్ తీయడంతో వెంటనే రిషి టాపిక్ చేంజ్ చేసి మాట్లాడుతాడు. అప్పుడు రిషి ప్రేమతో మాట్లాడుతూ ఉండగా వసుధార,రిషి బుజంపై తలపెట్టి అవన్నీ వింటూ ఉంటుంది. మరొకవైపు జగదీష్ మహేంద్ర లు ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతూ గుండెల్లో ఏదో బరువుగా ఉంది జగతి అని అంటాడు. ఇక ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నందుకు వారిద్దరూ బాధపడుతూ ఉంటారు. మరొకవైపు రిషి వసు లు ప్రేమతో మాట్లాడుకుంటూ ఉంటారు.
Read Also : Guppedantha Manasu: సరికొత్త ప్లాన్ వేసిన దేవయాని.. కోపంతో రగిలిపోతున్న మహేంద్ర.?