Singer revanth: రెండ్రోజుల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ హౌస్ లో ఇప్పడే హీట్ పెరిగిపోయింది. మొదలై రెండు రోజులు కూడా కాకముందే గొడవలు, నానా రచ్చ చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన బిగ్ బాస్ తొలివారం నామినేషన్స్ ప్రోమో వచ్చేసింది. తొలివారం నామినేషన్లలో భాగంగా ప్రాసెస్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇష్టం లేని వాళ్లు పేర్లు రాసి టాయిలెట్ సీట్ లో ఫ్లష్ చేయాలని చెప్పారు. అయితే ఈ నామినేషన్ టాస్క్ లో ఇంటి సభ్యుల మధ్య మాటల యుద్ధం నడించింది. ముఖ్యంగా జబర్దస్త్ ఫైమా, సింగర్ రేవంత్ లు సై అంటే సై అన్నారు.
ఫైమా పని చేయడం నేను చూడలేదని సింగర్ రేవంత్ అనడంతో.. నువ్వు చూడలేదేమో అని కౌంటర్ వేసింది ఫైమా. సర్లే నేను ఇంట్లో లేనేమోలే అని అన్నాడు రేవంత్. హౌస్ లో ఆటగాళ్లు ఉంటారు గానీ.. రేవంత్ మాటకారి అని సెటైరే వేసింది ఫైమా. అలాగే సుదీప, వాసంతి, కీర్తి, ఆరోహిలు సింగర్ రేవంత్ ను నామినేట్ చేశారు. అయితే ఆరోహి నామినేషన్స్ లో కూడా డైలాగ్ వార్ నడిచింది. ఆరోహిని నామినేట్ చేస్తూ.. ఆమ్మో వీడు లేచిండు అన్నదని అన్నాడు. ఆ మాట విన్న ఆరోహి నువ్వు ఇలాంటి బద్నాంలు చేస్తే ఈరుకోనంటూ గొడవ పడింది. ఇది నా నామినేషన్ ఆగు అని రేవంత్ అనడంతో…. ఓపిక పట్టి సచ్చిపోతున్నామని తెలిపింది. నిన్ను రెండు క్వశ్చన్ అడిగితే.. 20 మార్కుల ఆన్సర్ ఎలా చెప్తారో, నన్ను 20 మార్కుల క్వశ్చన్ అడిగితే.. 2 వేల మార్కు ఆన్సర్ చెప్తా సరేనా అంటూ ఇచ్చి ఆరోహ కామెంట్లు చేసింది.