Senior heroine savithri: మహానటి సావిత్రి తెలుగు సినీ రంగంలో మకుటం లేని మహారాణిగా నిలిచింది. ఆమె తన అసమాన నటనటో తెలుగు గడ్డపై లక్షలాది మంది ప్రేక్షకులను తన అభిమానులను సొంతం చేస్కుంది. సావిత్రి అంటే సినిమాల్లో నటించదు. జీవించేస్తుంది. ఆమె తెర మీద నటిస్తుంటే ప్రేక్షకులు ఆమె నటనలో లీనమైపోయారు. ఆమె చనిపోయి ఏళ్ల గడుస్తున్నా మనం ఇప్పటికీ ఆమెను మర్చిపోలేదు. కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా, దర్శకురాలిగా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసింది. సావిత్రి, స్టార్ హీరోలకు దీటుగా నటించిన ఆమెతో నటించాలంటే చాలా మంది జాగ్రత్త పడేవారు. సావిత్రి నట జీవితం గురించి మాట్లాడితే దిగ్గజ నటులైన ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు లాంటి వాళ్లు చాలా అలర్ట్ గా ఉండేవాళ్లు.
సావిత్రికి సినిమా జీవితంలో తిరుగులేకపోయినా వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన చివరి దశలో చాలా ఇభ్బందులు అనుభవించింది. మితిమీరిన దానధర్మాలతో సావిత్రి తన చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. జెమిని గణేషన్ పెళ్లి చేస్కోవడమే ఆమె చేసిన పెద్ద తప్పు. సావిత్రి తను చనిపోయాక తన సమాధిపై ఏమని రాయాలో వివరించిందట. చావులోనూ, జీవితంలోనూ ఒక మహోన్నతమైన తార ఇక్కడ శాశ్వతమైన విశ్రాంతిని తీసుకుటుందని. ఇక్కడకు ఎవరు వచ్చినా సానుభూతితో కన్నీళ్లు పెట్టవద్దు. ఈ సినీ పరిశ్రమలో ఎవరు కూడా హీనంగా చూడకుండా మరణం లేని ఆ సమాధిలో నిద్రిస్తున్న మహా ప్రతిభకు ఒక పూల మాలను ఉండి. ఇదే మీరు నాకిచ్చే గౌరవం అని సావిత్రి అన్నారట. ఆవిడ చివరి కోరిక మేరకు ఆమె సమాధిపై అలాగే రాశారు.