Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప, మోనిత కు ఇప్పుడు ఆట మొదలైంది అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్, దీప గురించి ఆలోచిస్తూ ఈవిడ చాలా విచిత్రంగా ఉంది. ఒక ఆమెకు ఇన్ని పేర్లు ఉన్నాయా అది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా పిలుస్తారా అంటూ దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్. మరొకవైపు సౌర్య తన అమ్మానాన్నలను తలుచుకుని వారణాసి దగ్గర బాధపడుతూ ఉంటుంది. రోజంతా ఆటోలో తిరిగినా కూడా అమ్మానాన్నలు కల్పించలేదు అని బాధపడుతుంది.
ఆ తర్వాత మోనిత, దీప గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే దీప అక్కడికి బిర్యాని తీసుకుని వస్తుంది. అప్పుడు దీప ను చూసిన మోనిత నీకు ఇక్కడ ఏం పని ఎందుకు వచ్చావు అంటూ కోప్పడుతుంది. అప్పుడు ఇంతలో కార్తీక్ అక్కడికి రావడంతో డాక్టర్ బాబు అని పిలవగా నన్ను అలా పిలవద్దు అని అంటాడు కార్తీక్. దీప కార్తీక్ కి బిర్యానీ వడ్డించగా ఇటువంటి బిరియాని రోజు అయినా తినాలనిపిస్తుంది చాలా బాగుంది అని మెచ్చుకుని అక్కడ నుంచి వెళ్లిపోతాడు కార్తీక్.
అప్పుడు దీప, మోనిత తో కార్తీక్ బాబుకి ఎలా అయినా నా మీద ప్రేమ వచ్చేలా చేసుకుంటాను అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు దీప వాళ్ళ డాక్టర్ అన్నయ్య ఇంటికి వెళ్లి జరిగిన మొత్తం వివరించడంతో వాళ్లు కూడా బాధపడుతూ ఉంటారు. అప్పుడు వారి ముగ్గురూ కలిసి ఆ చిన్న చిన్న ఆనందాన్ని షేర్ చేసుకుని సంతోషంగా ఉంటారు.
అప్పుడు దీప వాళ్ళ డాక్టర్ అన్నయ్య ఎలా అయినా నువ్వు తొందరగా కార్తీక్ ని మీ వశం చేసుకోవాలి లేకపోతే వారిద్దరికీ పిల్లలు పుడితే మీకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనడంతో దీప టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత సౌర్య తినకుండా వారణాసితో జరిగిన విషయాలను చెప్పుకొని అమ్మ,నాన్న దొరకలేదు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వారణాసి హిమ గురించి టాపిక్ తీయడంతో వెంటనే సౌర్య కోప్పడుతుంది.
ఆ తర్వాత దీప ఇంటికి వచ్చి ఒకప్పుడు నా బతుకు తెరువు కోసం వంటలు వండాను ఇప్పుడు నా ప్రేమ గెలవడం కోసం వంటలు వండుతున్నాను అని బాధపడుతూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్లో మోనిత కావాలని ఫుడ్ పాయిజనింగ్ అయినట్లు కార్తీక్ ని నమ్మిస్తుంది. దీంతో కొంత రగిలిపోయిన కార్తీక్, దీప ఇంటికి వెళ్లి నువ్వు నా భార్యను విషం పెట్టి చంపేద్దాం అనుకుంటున్నావా పరాయి మగాడి మీద అసలు పెట్టుకోకూడదు అంటూ దీపకు గట్టిగా వాడిని ఇవ్వడంతో ఎమోషనల్ అవుతుంది.
Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు దిగొచ్చాయి. మొన్నటివరకూ పెరుగుతూ వచ్చిన బంగారం…
Ketu Transit 2025 : ఈ 2025 సంవత్సరం కేతు సంచారం అనేక రాశుల జీవితాలను మార్చబోతోంది. ఈ సంవత్సరం…
Kotak Mahindra Bank : కోటక్ మహీంద్రా బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
Lakhpati Didi Scheme : మహిళలకు అదిరే న్యూస్.. మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.…
Tea Side Effects : అదేపనిగా టీ తాగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.…
RBI 50 Note : కొత్త రూ. 50 కరెన్సీ నోటు వస్తోంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…
This website uses cookies.