Intinti Gruhalakshmi Aug 29 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్లో లాస్య, తులసి సామ్రాట్లను ఉద్దేశించి కొంచెం వెటకారంగా మాట్లాడుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో లాస్య మాటలకు అనసూయ కోపంతో పగిలిపోతూ పరంధామయ్యతో లాస్య కావాలనే తులసిందే రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంది అని అంటుంది. అప్పుడు తులసికి ఏం చేయాలో తెలుసు అని అనసూయ కి నచ్చచెబుతాడు పరంధామయ్య. ఆ తర్వాత భూమి పూజ మొదలవడంతో అభివృద్ధి తులసి వెళ్లి ఏర్పాట్లు చూసుకుంటూ ఉండగా దూరం నుంచి ప్రేమ్ ఆనందంతో చూస్తూ ఉండిపోతాడు.
ఇంతలోనే అక్కడికి సామ్రాట్ వచ్చి ప్రేమ్ ని పలకరించగా ప్రేమ్ ఎమోషనల్ అవుతూ సామ్రాట్ ని హత్తుకుంటాడు. అప్పుడు తులసి పెద్ద కష్టాల గురించి చెప్పి మీరు ఇన్ని రోజులకు మా అమ్మకు తగిన దారి చూపించారు. అంటూ సామ్రాట్ నీ పొగడ్తలతో ప్రేమ్. అప్పుడు పక్కనే ఉన్న లాస్య , కావాలని నందుని మరింత రెచ్చగొట్టాలని రన్నింగ్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది.
ఆ తర్వాత పూజారి తులసి తో మీరు వచ్చిన తర్వాత ఈ భూమి పూజకు అసలైన కల వచ్చింది అనటంతో అది చూసిన లాస్య పూజారి కూడా తులసి భజన చేస్తున్నాడు అంటూ నందు ని మరింత రెచ్చగొడుతుంది. అప్పుడు నందు లాస్య చాటుగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో తులసి తమ్ముడు దీపక్ అక్కడికి వచ్చి మా అక్క గురించి మీరు ఎంత నీచంగా చూశారో నాకు తెలుసు మా అక్క కింద పని వాళ్ళలా బతుకుతున్నారు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో తులసి అక్కడికి వచ్చి దీపక్ ని తీసుకుని వెళుతుంది.
అందరూ పూజ దగ్గర ఉండగా ఇంతలో సామ్రాట్ అక్కడికి వచ్చి దీపక్ ని చూసి మీరు తులసి గారి తమ్ముడు కదా అని అంటాడు. మీకు ఎలా తెలుసు సార్ అని అనడంతో నీ గురించి చాలా విన్నాను కానీ మొదటిసారి చూస్తున్నాను అని అంటాడు సామ్రాట్. అప్పుడు దీపక్ గతం గురించి మాట్లాడటంతో మరి నువ్వు ఏం చేస్తున్నావు ఆపకుండా అని సామ్రాట్ అడగగా ఎప్పటికప్పుడు మా అక్క సంకెళ్లతో బంధించి దూరంగా పెట్టేది సార్ అని చెబుతాడు దీపక్.
అప్పుడు దీపక్ మాటలకు నందుకు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి సామ్రాట్ వాళ్ళ బాబాయ్ వచ్చి ప్రెస్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు అక్కడికి వచ్చి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వు అని చెప్పడంతో తులసి సామ్రాట్ అక్కడికి వెళ్లి పోతారు. అప్పుడు సామ్రాట్ తులసిగొప్పతనం గురించి మీడియా ముందు వివరించడంతో అది చూసి నందు కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
అప్పుడు తులసి కూడా మీడియా ముందు నందు నీ ఉద్దేశించి మాట్లాడుతూ తన గతాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో పంతులుగారు పూజ చేస్తూ వ్యాపారం చేసే వాళ్ళు భార్యాభర్తలతో సమానం అని అనగా ఇంతలోనే అక్కడికి ప్రేమ్ వచ్చి నానా రచ్చ చేస్తాడు. అప్పుడు దీపక్ ఇదంతా మీ నాన్న నేర్పించాడా అని అనగా అప్పుడు నందు ఇన్వాల్వ్ అయ్యే దీపక్ మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇప్పుడు సామ్రాట్ ఏం జరుగుతుందో అర్థం కాక నందువైపు అలా చూస్తూ ఉంటాడు.
Read Also : Intinti Gruhalakshmi Aug 26 Today Episode : ఆహ్వాన పత్రికను చింపేసిన అభి.. బాధతో కుమిలిపోతున్న తులసి..?
Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
This website uses cookies.