Rukmini Real Life : మా టీవిలో గత రెండు సంవత్సరాలుగా ప్రసారం అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్న అధ్భుతమైన సీరియల్ దేవత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అందులో రుక్మిణీ పాత్రతో అదరగొడ్తున్న నటి పేరు సుహాసిని. ఆమె నెల్లూరు జిల్లాలోని వెంకట రెడ్డి, జ్యోతి దంపతులకు 1983 మే 26వ తేదీన జన్నించింది. ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే సినిమాల్లో నటించడం ప్రారంబించింది. చంటిగాడు సినిమా ద్వారా కీలక పాత్ర పోషిస్తూ.. వెండి తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత లక్ష్మీ కల్యాణం, అడ్డా, పెదబాబు, దోస్త్, గుణ, సుందరానికి తొందరెక్కువ, పున్నమినాగు, భూ కైలాష్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే 2013లో వెండి తెరకు స్వస్తి పలుకుతూ అపరంజి సీరియల్ ద్వారా బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చింది అప్పటి నుంచి అందులోనే కొనసాగుతూ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ చేస్తోంది. అయితే ఇద్దరమ్మాయిలు సీరియల్ లో నటిస్తున్నప్పుడు తన కోస్టార్ ధర్మను ప్రేమించింది. పెద్దలను ఒప్పించి మరీ వీరు పెళ్లి చేసుకున్నారు. అంతే కాదండోయ్ 2012లో బెస్ట్ యాక్టరెస్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. పలు సీరియళ్లకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది.
Read Also : Viral video: తూనీగలా డ్యాన్స్ చేస్తున్న పెళ్లి కూతురు.. వరుడే కాదు బంధువులంతా ఫిదా!