Cobra Movie First Review : తమిళ సూపర్ స్టార్ విక్రమ్ హీరోగా కొత్త సినిమా కోబ్రా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. డైరెక్టర్ ఆర్ అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్‌లో యాక్షన్ థ్రిల్లర్ కోబ్రా తెరకెక్కించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ss లలిత్ కుమార్ ఈ మూవీని నిర్మించారు. హీరో విక్రమ్ దాదాపు 7 వేరేయేషన్లలో కనిపించనున్నాడు. వినాయక చవితి సందర్భంగా విక్రమ్ కోబ్రా మూవీ ఆగస్టు 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ రిలీజ్ కావడానికి ముందు సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు.
కోబ్రా మూవీ ఎలా ఉందో ట్విట్టర్ వేదికగా తెలిపాడు. విక్రమ్ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో వన్ మ్యాన్ షో చేశాడంటూ పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. ఈ సినిమాలో విక్రమ్ నటనలో అనేక వేరేయేషన్లు హైలట్‌గా నిలిచాయన్నాడు. మహాన్ మూవీతో హీరో విక్రమ్ సూపర్ హిట్ అందుకున్నాడు. సుమారు 7 పాత్రలలో కోబ్రాగా విక్రమ్ మెప్పించాడు. కేజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. అంతేకాదు.. కోబ్రా మూవీని తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. వాస్తవానికి ఈ మూవీని ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదు. దాంతో ఆగస్టు 31కి కోబ్రా మూవీని వాయిదా వేశారు.
నటీనటులు వీరే :
హీరో విక్రమ్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్ (క్రికెటర్), మియా జార్జ్, కేఎస్ రవికుమార్, రోషన్ మాథ్యూ, మృణాళిని రవి నటించారు. డైరెక్టర్ ఆర్ అజయ్ జ్ఞానముత్తు రచన, దర్శకత్వం వహించగా.. నిర్మాతగా ఎస్ఎస్ లలిత్ కుమార్ వ్యవహరించారు. సినిమా బ్యానర్ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించింది. ఎన్వీఆర్ సినిమా (ఎన్వీ ప్రసాద్) మూవీని రిలీజ్ చేయనున్నారు. మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ అందించగా.. డీవోపీగా హరీష్ కన్నన్, ఎడిటర్ భువన్ శ్రీనివాసన్ వ్యవహరించారు. కోబ్రా మూవీ రిలీజ్ డేట్ 31, ఆగస్టు, 2022
Cobra Movie First Review : 7 పాత్రల్లో విక్రమ్ నట విశ్వరూపం.. విజువల్ ట్రీట్
అయితే ఈ మూవీకి అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్ అద్భుతంగా ఉందని తెలిపాడు. మూవీలో క్లైమాక్స్ అదిరిందని ఉమైర్ సంధూ చెప్పాడు. కోబ్రా మూవీలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటించడం విశేషం. పఠాన్ తనదైన పాత్రలో అద్భుతంగా నటించాడని ఉమైర్ సంధు తెలిపాడు. ఈ మూవీని దర్శకుడు అద్భుతంగా తీర్చిదిద్దారని ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉందని తెలిపాడు. మరి మాస్ ఆడియన్స్‌ను కోబ్రా మూవీ ఎలా అట్రాక్ట్ చేస్తుంది అనేది వేచి చూడాలి.
ఉమైర్ సంధూ రివ్యూలు ఈ మధ్య పెద్దగా సరిగా ఉండటం లేదు. ఆయన ఇచ్చిన రివ్యూలు దాదాపు రివర్స్ ఉన్నాయి. ఈ మూవీపై కూడా ఉమైర్ సంధు ఇచ్చిన రివ్యూను పెద్దగా నమ్మలేమంటున్నారు. ఇప్పటివరకూ చాలా సినిమాలకు ఆయన ఫస్ట్ రివ్యూ బాగుందనే ఇచ్చారు. కానీ, ఆ సినిమాలు దాదాపు అన్ని బాక్సాఫీసు వద్ద ప్లాప్ టాక్ అందుకున్నాయి.
ఇటీవల రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ మూవీ లైగర్ కూడా అద్భుతంగా ఉందంటూ ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. లైగర్ మూవీ ఫ్లాప్ అయింది. ఈ కోబ్రా మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ అందించగా.. తెలుగులో ప్రముఖ సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్ రిలీజ్ చేయనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కోబ్రా మూవీని రిలీజ్ చేయనున్నారు. కోబ్రా మూవీలో అనేక ట్విస్టులు, టర్నింగ్ పాయింట్లతో మూవీ చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుందని, ఆడియోన్స్ ను తప్పుకుండా ఎంగేజ్ చేస్తుందని చెప్పుకొచ్చాడు.
First Review #Cobra !
AdvertisementA Unique Concept with Terrific Direction, Climax & Production Designing! #Vikram gave Award Worthy Performance ! He Stole the Show all the way. @IrfanPathan Good to see you ✌️ ! An engaging film with twists & turns ! Multiplex Fans will love it ! ⭐️⭐️⭐️1/2
Advertisement— Umair Sandhu (@UmairSandu) August 29, 2022
Advertisement
చివరికి ఈ మూవీకి తాను 3.5/5 రేటింగ్ ఇస్తున్నట్టు తెలిపాడు. ఫైనల్‌గా చూస్తే.. కోబ్రా ఒక విజువల్ ట్రీట్ అని చెప్పాలి. కోబ్రా సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ మూవీలో కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రతి ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని కలిగించేలా అనేక సీన్లు ఆసక్తిని రేపుతాయి. రష్యాలో షూటింగ్ చేసిన యాక్షన్ సీన్లు చాలా వరకూ ప్రేక్షుకులకు మెప్పించేలా ఉంటాయని ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు.
Read Also : Wanted PanduGod Movie Review : ‘వాంటెడ్ పండుగాడ్‘ మూవీ రివ్యూ.. టీవీ స్కిట్‌లకు ఎక్స్‌టెండెడ్ వెర్షన్..!