Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దీప పూజ చేస్తూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో దీప పూజ చేస్తూ ఉండగా అప్పుడు కార్తీక్ నువ్వు నా ఇంటి దీపానివి నా ప్రాణానికి దీప అటువంటిది ఆ దేవుడు ఈ దీపాన్ని ఆర్పేయాలని చూస్తున్నాడు. కానీ నేను నిన్ను కాపాడుకుంటాను దీప ఎలా అయినా నిన్ను దక్కించుకుంటాను అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత దీప దేవుడికి పూజిస్తూ ఎలా అయినా డాక్టర్ బాబు మనసులు మార్చి వాళ్ళ అమ్మానాన్న దగ్గరికి వెళ్లేలా చూడు స్వామి అని కోరుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి చారుశీల వస్తుంది. సమయానికి వచ్చావు చారుశీల ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను లోపలికి వెళ్దాం పద నీతో ఒక విషయం మాట్లాడాలి అనడంతో ఒక్క నిమిషం దీపక్క అని దేవుడికి మొక్కుకుంటూ స్వామి నేను అనుకున్న పని ఇంత తొందరగా అవుతుందని అనుకోలేదు నన్ను కార్తీక్ పెళ్లి చేసేలా చూడు అని కోరుకుంటూ ఉంటుంది.
ఆ తర్వాత కార్తీక్ ఎదురుగా నిలబడిన కార్తీక్ ని పట్టించుకోకుండా లోపలికి వెళ్తుండడంతో మా అక్క చెల్లెళ్లకు చాలా ఉంటే అవన్నీ మీకు చెప్పాల్సిన పని లేదు అని లోపలికి వెళ్తారు దీప చారుశీల. మరొకవైపు శౌర్య హేమచంద్రతో మాట్లాడుతూ అది అంకుల్ జరిగింది అప్పటి నుంచి అమ్మానాన్నల కోసం వెతుకుతూనే ఉన్నాను కానీ కనిపించలేదు అని అంటూ బాధపడుతూ ఉంటుంది. వాళ్లు మిమ్మల్ని రోజు చూస్తున్నారు కానీ కలవలేని పరిస్థితిలో ఉన్నారమ్మ అని హేమచంద్ర తన మనసులో అనుకుంటూ ఉంటాడు.
అంకుల్ మీరు నాకు అమ్మ నాన్నలను వెతకడంలో సహాయం చేస్తారా అనడంతో తప్పకుండా చేస్తాను అని శౌర్య ఫోటో తీసుకుంటుండగా నా ఫోటో ఎందుకు అంకుల్ అనడంతో మీ అమ్మ నన్ను ఎప్పుడైనా కనిపిస్తే మీ పాపం మీకోసం వెతుకుతుంది అని అడిగినప్పుడు వాళ్లు నమ్మకపోతే నీ ఫోటో చూపిస్తాను అని అంటాడు హేమచంద్ర. అలా అయితే ఈ ఇద్దరు కలిసి సెల్ఫీ తీసుకుందాం అంకుల్ అను వారిద్దరు సెల్ఫీ తీసుకుంటారు. మరొకవైపు ఏంటి ఈ దీప నాకు కార్తీక్ నుంచి పెళ్లి చేస్తుంది అనుకుంటే కార్తీక్ ని వాళ్ళ అమ్మానాన్నల దగ్గరికి పంపియమని నన్ను అడుగుతుంది నా ప్రాణం మొత్తం రివర్స్ అయ్యేలా ఉంది అనుకుంటూ ఉంటుంది.
అప్పుడు దీప నేను చెప్తే డాక్టర్ బాబు వినడం లేదు నువ్వు చెప్తే కచ్చితంగా వింటారు. నువ్వు నేను చనిపోయిన తర్వాత డాక్టర్ బాబు ఏమైపోతారు అని నాకు బాధగా ఉంది ఎలా అయినా నువ్వే చేర్చు అలా అని నాకు మాట ఇవ్వు అనడంతో చారుశీల షాక్ అవుతుంది. అప్పుడు చారుశీల ఆలోచిస్తుండడంతో దీప చారుశీల చేతిని తన చేతిలో వేసుకొని మాట ఇచ్చావు తప్పకూడదు అని అంటుంది. అప్పుడు చారుశీల ఇదేంటి ఇలా జరిగింది దీపను పైకి పంపించి కార్తీక్ దగ్గర అయ్యి కార్తీక్ ని పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం కాజేయాలని చూస్తుంటే ఇలా ఇరికించేసింది అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు చంద్రమ్మ వంట చేసుకుంటూ ఉండగా ఇంద్రుడు కాఫీ ఇవ్వు అనడంతో నా చేతులు ఖాళీగా లేవు మళ్ళా ఇస్తాను అని అంటుంది.
అప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే చంద్రమ్మ ఏంటో గండ వీళ్ళ బాధ చూస్తే నాకు మొత్తం నిజం చెప్పేయాలి అనిపిస్తుంది అని అనడంతో నాకు కూడా అలాగే ఉంది చంద్రమ్మ అని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే హిమా అక్కడికి రావడంతో వాళ్ళు షాక్ అవుతారు. అప్పుడు ఇంద్రుడు టెన్షన్ పడుతూ ఉండగా స్వారీ బాబాయ్ భోజనం చేసేటప్పుడు మిమ్మల్ని నేను అనలేదు కానీ శౌర్య నన్ను అపార్థం చేసుకుంది నేను అమ్మానాన్నల కోసం బాధపడుతూ అలా మాట్లాడాను అనడంతో నీ మీద నాకు కోపం లేదు బంగారం సౌర్య ఎంతో నువ్వు కూడా మాకు అంతే అని అంటాడు ఇంద్రుడు. అప్పుడు ఇంద్రుడు చూడు హిమ నువ్వు బాధపడకు నిన్ను సౌర్యని ఒకటి చేసే బాధ్యత నాది అనడంతో అవునా బాబాయ్ అని సంతోషంతో మాట్లాడుతుంది హిమ.
తర్వాత దీప పండరీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఉండగా ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి పండరీని బయటికి వెళ్లమని చెప్పి దీప మీద సీరియస్ ఎన్నిసార్లు చెప్పాలి దీప నేను నీతో పాటే ఉంటాను ఎక్కడికైనా నీతో పాటు కలిసి వస్తాను అని మళ్ళీ ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు అన్ని చేస్తున్నావు అనడంతో అది కాదు డాక్టర్ బాబు అనగా నువ్వేం మాట్లాడకు దీప అని సీరియస్ అవుతాడు కార్తీక్. నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో చారి చేయలే అక్కడికి వచ్చి వారి మాటలు విని సంతోష పడుతూ ఉంటుంది. సూపర్ కార్తీక్ మీ అమ్మ నాన్న దగ్గర వెళ్ళకుండా అదే మాట మీదే ఉండు నేను నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో అలాంటి ప్లాన్లు వేస్తాను అని అనుకుంటూ ఉంటుంది.
ఇంతలోనే హేమచంద్ర సౌర్యతో కలిసి దిగిన ఫోటోని పెట్టడంతో అది చూసి దీప, కార్తీక్ ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. డాక్టర్ బాబు కూతురు ఫోటో పంపించగానే అంత సంతోష పడుతున్నారు అలాంటిది మరి వారి మీద అంత ప్రేమ పెట్టుకుని ఎలా ఉండగలుగుతున్నారు అనడంతో నువ్వు నా ప్రాణం దీప అని దీప అని హత్తుకుంటాడు కార్తీక్. అది చూసి చారుశీల కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత హిమ జరిగిన విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఉండగా ఆనందరావు ఓదారుస్తూ ఉంటాడు. మరొకవైపు శౌర్యతో ఇంద్రుడు మాట్లాడుతూ సౌర్య,హిమ ను కలిపే ప్రయత్నం చేయగా దాన్ని ఎప్పటికీ క్షమించను బాబాయ్ అని అంటుంది శౌర్య. ఆతరువాత హిమ బాధపడుతూ ఉండగా ఈ ఆనందరావు ఓదారుస్తూ ఉంటాడు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World