Biggboss 6 Telugu : బిగ్‌బాస్ వంటలక్క అవుట్.. సుదీపను బయటకు గెంటేశారా? షాకింగ్ ట్విస్ట్ ఇదే..!

Biggboss 6 Telugu : బిగ్‌బాస్‌లో ఏమైనా జరగొచ్చు.. ఎవరు ఉంటారో.. ఎవరు వెళ్లిపోతారో ఊహించడం కష్టమే. ఈ వారం వెళ్లిపోతారులే అనుకున్న వారు ఉంటారు.. ఉంటారులే అనుకున్న వాళ్లే వెంటనే వెళ్లిపోతుంటారు. బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్‌లు ఎవరికి అర్థం కావులే.. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి పింకీ సుదీప బయటకు వెళ్లిపోయిందని తెలిసింది. వాస్తవానికి సుదీప ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్లాల్సింది. కానీ, ఇన్నాళ్లు వంటలక్కను బిగ్ బాస్ బాగానే భరించారు. ఇక హౌస్‌లో ఉంచుకుని లాభం లేదులే అనుకున్నారేమో సుదీప ప్యాక్ యువర్ బ్యాగ్స్ అనేశారు. తట్టాబుట్టా చదురుకుని సుదీప బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయిందంటూ లీక్ వీరులు ప్రచారం చేస్తున్నారు.

Biggboss 6 Telugu Sudeepa Eleminated This Week From House

నువ్వు నాకు నచ్చావ్ మూవీలో పింకీగా సుపరిచితమైన సుదీప.. అంతగా హౌస్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ కారణంగానే ఈ వారం సుదీపకు ఓటింగ్ చాలా తక్కువగా వచ్చినట్టు తెలుస్తోంది. అసలు రెండు వారాల క్రితమే సుదీప బయటకు వెళ్లిపోయేది. కానీ, బిగ్ బాస్ మరో అవకాశం ఇచ్చారు. అందులో సుదీప టాస్కుల్లో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వంటలక్కగా హౌస్‌లో అందరిని మెప్పించిన సుదీప.. ప్రేక్షకులను మెప్పించలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Biggboss 6 Telugu : పింకీ ప్యాక్ యువర్ బ్యాగ్స్..

Biggboss 6 Telugu Sudeepa Eleminated This Week From House

ఇప్పటివరకూ బిగ్ హౌస్‌ నుంచి అభినయ శ్రీ, షాని, నేహా చౌదరి, ఆరోహి, చంటి ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. ఇక ఆరో వారం కూడా హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యేది బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. ఈ వారం నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లలో కీర్తి, సుదీప, గీతూ, బాలాదిత్య, ఆదిరెడ్డి, శ్రీహాన్‌, శ్రీసత్య, రాజ్‌, మెరీనా ఉన్నారు. వీరిలో శ్రీహాన్ 20 శాతం ఓట్లు వచ్చాయట..

ఇక ఆది రెడ్డికి 13 శాతం, శ్రీ సత్య, బాలాదిత్య, రాజ్, గీతూ 10 శాతం మేర ఓట్లు వచ్చాయట.. మరీనా 11 శాతంగా ఓట్లు వచ్చాయని లీక్ సమాచారం. ఓటింగ్ ప్రకారం చూస్తే.. శ్రీహాన్‌, శ్రీస‌త్య‌, గీతూ రాయ‌ల్ ఆది రెడ్డి సేఫ్ అయ్యారట.. రాజ శేఖ‌ర్‌, కీర్తి కూడా సేఫ్ అయినట్టు తెలిసింది. అందరికన్నా అతి తక్కువగా సుదీప 9.5 శాతం ఓట్లతోనే సరిపెట్టుకుందంట.. సుదీప డేంజర్ జోన్‌ లోకి వెళ్లడంతోనే ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.

Advertisement
Biggboss 6 Telugu Sudeepa Eleminated This Week From House

వాస్తవానికి హౌస్ లోకి వెళ్లిన దగ్గరనుంచి సుదీప ఇంటిలో కిచెన్ దగ్గరే ఎక్కువగా హడావిడి చేసింది. వంటగదికే ఎక్కువగా రేషన్ మేనేజర్‌గా హౌస్ మేట్లను బాగా ఆకట్టుకుంది. ఇంటిలోని వారందరికి రుచికరమైన భోజనం పెట్టి బిగ్ బాస్ వంటలక్కగా పేరు సంపాదించుకుంది. టాస్కుల్లో మాత్రం సుదీప ఆకట్టుకోలేకపోయింది. అదే సుదీపకు బాగా మైనస్ అంటున్నారు నెటిజన్లు.

ఈ ఆరో వారంలో ఎవరూ ఊహించిన విధంగా సుదీప హౌస్ నుంచి ఎలిమినేట్ అయిందనే వార్తలతో ఫ్యామిలీ ఆడియెన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పింకిగా హౌస్‌లోకి వెళ్లిన సుదీప.. వంటలక్కగా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా.. బయటకు వచ్చేసిన సుదీప హౌస్ లో జరిగే విషయాలపై ఎలాంటి సీక్రెట్లను బయటపెడుతారో చూడాల్సిందే..

Advertisement

Read Also : Keerthi Suresh : కీర్తి సురేశ్‌ కిర్రాక్ డ్యాన్స్ చూశారా? పంచకట్టుతో పిచ్చెక్కించిన కళావతి.. వైరల్ వీడియో!
Read Also : TS Group -1 Exam : నెలరోజుల పసిబిడ్డతో గ్రూప్ పరీక్షకు తల్లి.. పరీక్ష రాస్తుంటే.. ఆకలితో పాప కేకలు..!

Advertisement
Tufan9 News

Recent Posts

Summer AC Tips : ఎండలు బాబోయ్.. AC ఆన్ చేసే ముందు జాగ్రత్త.. మీ విద్యుత్ ఆదా చేసే పవర్‌ఫుల్ టిప్స్ మీకోసం.. !

Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…

2 days ago

Poco C71 Launch : పోకో కొత్త C71 ఫోన్ కిర్రాక్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…

3 days ago

Realme 13 Pro Price : కొత్త ఫోన్ కేక.. రియల్‌మి 13ప్రోపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.8వేలు తగ్గింపు

Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…

3 days ago

CSK vs RCB : చెన్నైపై బెంగళూరు గెలుపు.. ఎన్ని సిక్సర్లు బాదారు, పాయింట్ల పట్టికలో ఎవరు టాప్ అంటే?

CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…

2 weeks ago

Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ యూజర్ల కోసం IPTV సర్వీసు ప్లాన్లు.. 350 లైవ్ టీవీ ఛానల్స్, 26 OTT యాప్స్..

Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…

2 weeks ago

Spinach : పాలకూర ఎందుకు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ ఇదే తింటారు..!

Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…

2 weeks ago

This website uses cookies.