Shanmukh jaswanth : యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ దసరా పండుగ సందర్భంగా ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. లగ్జరీ బ్రాండ్ బీఎండబ్ల్యూ కారును సొంతం చేసుకున్నాడు. తల్లిదండ్రులతో కలిసి షోరూంకి వెళ్లిన ఆయన తన ఏళ్లనాటి కలను నెరవేర్చుకున్నాడు. కత్త కారు పక్కనే ఫోజులు ఇస్తూ ఫొటోలు దిగాడు. ఈ సంతోషకర విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. నన్ను ఈ స్థాయిలో చూడాలనుకున్న వారు నా కుటుంబ సభ్యులు, నా అభిమానులు మాత్రమేనని తెలిపారు. ఈ కారు కొనడం కలలా ఉందని వివరించాడు. ఎప్పుడైనా కనిపిస్తే లిఫ్ట్ అడగండి తప్పక ఇస్తానని ప్రామిస్ చేశాడు.
అయితే షణ్ముఖ్ కొన్న ఈ కారు ధర చాలా ఎక్కువ. బీఎండబ్ల్యూ2 సిరీస్ గ్రాండ్ కోప్ మోడల్ కు చెందిన ఈ కారు అక్షరాల 51 లక్షల రూపాయలు. ఎప్పటి నుంచో లగ్జరీ కారు కొనాలనుకుంటున్న షణ్ముఖ్ ఎట్టకేలకు బీఎండబ్ల్యూ సొంతం చేసుకున్నారు. ఇక యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన షణ్ముఖ్ సెలబ్రిటీగా మారాడు. ఆ పాపులారిటీతోననే బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనే ఛాన్స్ దక్కించుకున్నాడు.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement