Samantha anushka : స్వీటీ అనుష్క శెట్టి సినిమాలో కనిపించి చాలా రోజులే అవుతోంది. అప్పుడెప్పుడో నిశ్శబ్దం మూవీలో కనిపించిందంటే మళ్లీ బిగ్ స్క్రీన్ పై కనిపించిన దాఖలాలు లేనే లేవు. అభిమానులు ఎప్పుడెప్పుడు స్వీటీని మళ్లీ తెరపై చూస్తామా అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలో అనుష్క నటిస్తుందని ప్రకటించారు. ఇందులో యువ నటుడు నవీన్ పొలిశెట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే అధికారికంగా ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయినా కూడా ఇప్పటి వరకు షూటింగ్ ప్రారంభం కాలేదు. ఇందుకు సంబంధించిన అప్ డేట్ల కోసం అప్ డేట్లు మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఫ్యాన్స్ ఈ అప్ డేట్ల కోసం తెగ వేచి చూస్తున్నారు.

Samantha anushka :సమంత కోసం అనుష్కగెస్ట్ రోల్..
అయితే తాజాగా స్వీటీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్ సమంతతో కలిసి అనుష్క స్క్రీన్ షేర్ చేస్కుందని.. ఇప్పటికే వీరిద్దరికీ సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయిందని ప్రచారం జరుగుతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ ప్రధాన పాత్రలో శాకుంతలం సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం కాబోతుంది. ఈ సినిమాలోనే అనుష్క కూడా నటించిందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇవన్నీ తప్పుడు వార్తలు అని ఈ సినిమా నిర్మాత నీలిమ గుణ క్లారిటీ ఇచ్చారు.
Read Also : Samantha : సమంత ఫస్ట్ జాబ్ తెలుసా..? నా ఫస్ట్ సాలరీ ఇదే అంటున్న సామ్.. వీడియో!