Sudigali sudheer : తెలుగు రాష్ట్రాల్లో టీవీలు చూసే ప్రెతి ఒక్కరికి సుడిగాలి సుధీర్ అంటే తెలిసే ఉంటుంది. జబర్దస్త్ కామెడీ షోతో వెలుగులోకి వచ్చిన సుధీర్.. అంచెలంచెలుగా ఎదిగాడు. తన ప్రతిభతో చాలా తక్కువ సమియంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. తన పర్సనాలిటీకి తోడు డ్యాన్సులు, కామెడీ, డైలాగులు ఇలా అన్నింటిలోనూ తన మార్కు చూపించడంతో పేరు దానంతట అదే వచ్చేసింది. ఎక్కడ లేని పాపులారిటీ తెచ్చి పెట్టింది. జబర్దస్త్ లో ఉన్నప్పుడే సుడిగాలి సుదీర్, అందాల సుందరాంగి యాంకర్ రష్మి మధ్య ఏదో ఉందన్న భావనను క్రియేట్ చేశారు జబర్దస్త్ దర్శకులు. అది అటు షోకు, ఇటు సుధీర్, రష్మిలకు మంచి పాపులారిటీ తీసుకువచ్చింది.
వీరిద్దరిదీ మంచి జోడి అని అంతా ఫీల్ అవుతుంటారు కూడా. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే సుధీర్ జబర్దస్త్ నుండి శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి బయటకు వచ్చేశాడు. సినిమాలతో బిజీ అయ్యాడు. మరోవైపు రష్మి అడపా దడపా సినిమాలు చేస్తూనే జబర్దస్త్ కు హోస్టు గా కొనసాగుతోంది.
Sudigali sudheer : సుధీర్ రష్మీ రొమాన్స్ చేయాలని..రష్మీ సుధీర్ రొమాన్స్ చేయాలని నెటజన్లు కామెంట్లు.
కె. రాఘవేంద్రరావు సమర్పణలో పండుగాడ్ చిత్రంలో సుధీర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సునీల్ మెయిన్ రోల్ చేస్తుండగా.. అనసూయ, దీపికా పిల్లి, విష్ణు ప్రియా వంటి వారు ఇందులో ఉన్నారు.
ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. ఇందులో దీపికా పిల్లితో కలిసి సుధీర్ రొమాన్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సుధీర్ రష్మీతోనే రొమాన్స్ చేయాలని.. అలాగే రష్మీ కూడా సుధీర్ తోనే రొమాన్స్ చేయాలని నెటజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Read Also : Sudigali Sudheer: ఎట్టకేలకు మల్లెమాల నుంచి బయటపడిన సుధీర్… సుధీర్ పై సెటైర్లు వేసిన నాగబాబు, ధన్ రాజ్!