Intinti Gruhalakshmi Aug 13 Today Episode : తెలుగు బుల్లితెరపై ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి సామ్రాట్ ఇద్దరు ఆనందంగా నవ్వుతూ ఉండడం చూసి నందు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో అంకిత వంట సరిగా చేయలేదు అని అభి తులసిని మధ్యలోకి లాగి సూటిపోటు మాటలు అని అన్నం తినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు అంకిత ఇదంతా కూడా నా వల్లే జరిగింది. ఈరోజు రాత్రికి వంట బయట నుంచి తెప్పించుకుందాము అని అంకిత అనగా అప్పుడు అనసూయ వద్దు నువ్వే వంట చేయాలి అని అంకితకు చెబుతుంది.
మరొకవైపు ఫ్లైట్ లో తులసి చాలా సంతోషంగా కనిపిస్తుంది. తులసి సంతోషంగా ఉండటం చూసి నందు వాళ్ళు కుళ్లుకుంటూ ఉంటారు. అప్పుడు తులసి ని చూసి లాస్య రన్నింగ్ కామెంట్స్ చేస్తున నందు మి మరింత రెచ్చగొడుతూ ఉంటుంది. ఆ తర్వాత తులసి తన ఫోన్ సామ్రాట్ కీ ఇచ్చి ఫోటోలు తీయమని చెబుతుంది. కానీ సామ్రాట్ మాత్రం ఏకంగా తన మొబైల్లోనే తులసి ఫోటోలను తీస్తాడు.
అది చూసిన ఆ ఫోటోలు సామ్రాట్ మళ్లీ చూసుకోవడానికి పనికొస్తాయి కాబట్టి అలా చేశాడు అని అనడంతో నందుకు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ తర్వాత తులసి ఆనందంతో ఫోటోలకు తెగ ఫోజులు ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆ ఫోటోలను ఇంట్లో వాళ్లకు పంపిస్తుంది తులసి. ఆ ఫోటోలను దివ్య ఇంట్లో అందరికీ చూపించడంతో అందరూ సంతోషపడుతూ ఉంటారు. ఆ తర్వాత తులసి ఇంట్లో వాళ్లకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆ తర్వాత తులసి ఫోన్ కట్ చేసినాక నేను చాలా ఎక్కువ చేస్తున్నానా అని సామ్రాట్ ని అడుగుతుంది ఆ తర్వాత లాస్య వెనకాల సీట్లు కూర్చున్న వ్యక్తి సామ్రాట్ తన గురించి చెప్పుకుంటూ ఉంటాడు.
Intinti Gruhalakshmi Aug 13 Today Episode : తులసీపై కోపంతో రగిలిపోతున్న నందు, లాస్య..
ఇక మీరిద్దరూ ఎవరో చెప్పనా మీరిద్దరూ భార్యాభర్తలు అనడంతో నందు షాక్ అవుతాడు.. తులసి కూడా షాక్ అవుతుంది. అప్పుడు నందు ఆ వ్యక్తిపై కోపంగా అరవడంతో సామ్రాట్ పోనీలే వదిలేయి అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి నందు దంపతులను చూసి సెటప్ అని అనటంతో తులసి, సామ్రాట్ ఇద్దరూ బాగా నవ్వుకుంటారు. అప్పుడు నందు లాస్య ఇద్దరు కోపంతో రగిలిపోతూ ఉంటారు.
మరొకవైపు అంకిత ప్రేమ్‌కు శృతి గురించి కొన్ని మాటలు చెబుతూ ఉంటుంది. ఆంటీ తిరిగి వచ్చే లోపు శృతిని నువ్వు తీసుకుని రావాలి అని అంటుంది. ఆ తర్వాత ఫ్లైట్ బయలుదేరగా తులసి నవ్వుతూ సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత టెక్నికల్ ప్రాబ్లం వల్ల అయిపోయినట్టు కనిపించడంతో నయందు ఎయిర్ పోస్ట్ పై అరుస్తాడు. పక్కకు నెట్టేయడంతో వెంటనే నందు కి తులసి క్లాస్ పీకుతుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World