Big Boss Non Stop Telugu : బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం రోజురోజుకు ఎంతో రసవత్తరంగా కొనసాగుతూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది.ఈ క్రమంలోనే ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా పలువురు కంటెస్టెంట్ లు కెప్టెన్సీ కోసం తీవ్రస్థాయిలో శ్రమించారు. అలాగే ఈ కెప్టెన్సీ టాస్క్ కి బిగ్ బాస్ సంచాలకురాలుగా అషు రెడ్డిను ఎంపిక చేశారు. అయితే ఈ టాస్క్ లో భాగంగా అషు రెడ్డి పక్షపాతం చూపించినట్లు తెలుస్తుంది. అఖిల్ గ్యాంగ్ ని ఎలాగైనా గెలిపించాలని తాపత్రయంతో సిల్లీ రీజన్ చెప్పి ఈ పోటీ నుంచి హమీద అనిల్ ను తప్పించింది.
ఇక హమీదా,అనిల్ జంటలో ఎవరో ఒకరికి మాత్రమే కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొనే అవకాశం ఉందని వీరిద్దరిలో ఎవరు కెప్టెన్సీ టాస్క్ లో పాల్గొంటారు డిసైడ్ కావాలని బిగ్ బాస్ సూచించారు. బిగ్ బాస్ ఇలా చెప్పేసరికి హామీద ఈ పోటీ నుంచి తాను తప్పుకొని అనిల్ కు అవకాశం ఇస్తుంది. ఎత్తర జెండా అనే కెప్టెన్సీ టాస్క్ పూర్తయ్యేసరికి నటరాజ్, శివ, మిత్ర, మహేష్‌లు కెప్టెన్సీదారులుగా ఎంపికయ్యారు.
ఈ ఐదుగురు కెప్టెన్సీ టాస్క్ కోసం ఒకరికి మించి మరొకరు తీవ్రస్థాయిలో కృషి చేసి పోటీపడ్డారు.ఇలా ఐదుగురి కంటెస్టెంట్ ల మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో చివరికి యాంకర్ శివ విజేతగా నిలవడంతో ఈవారం కెప్టెన్సీగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే కెప్టెన్సీగా గెలుపొందడంతో శివ ఎంతో సంతోషం వ్యక్తం చేయగా సంచాలకురాలుగా ఉన్నటువంటి అషు రెడ్డి పక్షపాతం చూపించిందని నెటిజన్లు పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.