Karthika Deepam Dec 26 Today Episode : సౌర్యను చూసిన దీప.. దీపను మళ్లీ మోసం చేస్తున్న కార్తీక్?

anand rao fires on sourya in todays karthika deepam serial episode
anand rao fires on sourya in todays karthika deepam serial episode

Karthika Deepam Dec 26 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో సౌందర్య వాళ్ళు ఒక ఇంటికి వెళతారు.

ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య ఆనంద్ రావు వాళ్లు కొత్త ఇంటికి వెళ్లి ఆ ఇంటిని చూసి చాలా బాగుంది అని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు శౌర్య నాకు ఇల్లు ఏమి నచ్చలేదు ఆ పాత ఇల్లే బాగుంది అని కోపంగా అరవడంతో వెంటనే ఆనంద్ రావు నోరు ముయ్ ఈ మధ్య నీకు నోరు ఎక్కువ అవుతోంది అని సౌర్య మీద సీరియస్ అవ్వడంతో సౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సౌందర్య ఏంటండీ మీరు దానిపై ఎలా సీరియస్ అయ్యారు అనడంతో దానికి ఇంట్లో వాళ్ళు తప్పితే బయట వాళ్లందరూ నచ్చుతారు అని కోపంగా అరిచి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆనందరావు.

Advertisement
Karthika Deepam Dec 26 Today Episode
Karthika Deepam Dec 26 Today Episode

మరొకవైపు చారుశీల పండరి కి ఫోన్ చేసి టాబ్లెట్లు ఇచ్చావా పండరి జాగ్రత్తగా చూసుకో అంటూ నాటకాలు వాడుతూ ఉంటుంది. ఇంతలోనే కార్తీక్ అక్కడికి రావడంతో ఎందుకు కార్తీక్ అలా దీపకు అబద్ధం చెప్పావు అని అనగా ఇప్పుడు దీప నా గురించి తప్ప శౌర్య అమ్మ వాళ్ల గురించి ఆలోచించదు అప్పుడు నేను తనని కాపాడుకోవచ్చు అనడంతో అవకాశం లేదు కార్తీక్ నేనే దీపను పైకి పంపించేస్తాను అని అనుకుంటూ ఉంటుంది చారుశీల. ఆ తర్వాత కార్తీక్ దీప ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు.

సౌర్య కనిపిస్తే ఇక్కడి నుంచే చూడాలి దగ్గరికి వెళ్లకూడదు అనడంతో సరే అని అంటుంది దీప. ఇంతలోనే ఇంద్రుడు సౌర్యని సైకిల్ పై తీసుకురావడంతో అది చూసి దీప సంతోషపడుతుంది. సౌర్య నీ చూసిన దీప గతంలో జరిగిన విషయాలు అన్నీ తలుచుకొని సంతోష పడుతూ ఉంటుంది. నా సౌర్య నా రౌడి అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంత దూరం వచ్చినా కూతురిని కలవకపోవడం డాక్టర్ బాబు నేను వెళ్లి కలుస్తాను అని దీప కార్ దిగి వెళ్ళబోతుండగా అప్పుడు కార్తీక్ దీపను వెళ్లకుండా అడ్డుకుంటాడు. నా పరిస్థితి తెలిసి కూడా మళ్లీ నువ్వు ఇలానే ప్రవర్తిస్తున్నావు దీప అందుకేనా నేను ఇక్కడికి తీసుకు వచ్చింది అని దీపక్ మళ్లీ అబద్ధాలు చెప్పి మోసం చేస్తూ ఉంటాడు కార్తీక్.

Advertisement

ఇప్పుడు సౌర్య అక్కడే ఉన్న బండిపై అరటి పండ్లు తింటూ ఉంటుంది. ఆ తర్వాత కార్తీక్ దీపక్ నచ్చదు చూపి అక్కడ నుంచి పిలుచుకొని వెళ్తాడు. మరొకవైపు సౌందర్య హీమతో మాట్లాడుతూ నువ్వు ఈ టెన్షన్స్ లో పడి చదువు నెగ్లెక్ట్ చేయకు హిమ ఆన్లైన్ క్లాసెస్ బాగానే జరుగుతున్నాయి కదా అటెండ్ అవ్వు అనడంతో సరేనా నెంబర్ రేపు ఎగ్జామ్ కూడా ఉంది అని అంటుంది. నీతో పాటు సౌర్యను కూడా పిలుచుకుని వెళ్ళు అనడంతో అది నాతో మాట్లాడటమే లేదు అలాంటిది నాతో పాటు కలిసి చదువుకుంటుందా అని అంటుంది హిమ. అప్పుడు సౌందర్య సౌర్యను పిలవడంతో చంద్రమ్మ అక్కడికి వచ్చి సౌర్యమ్మ లేదమ్మా తన బాబాయ్ తో కలిసి బయటికి వెళ్లింది అని అంటుంది.

అప్పుడు సౌందర్య ఈ టైంలో ఎందుకు అనడంతోమా గండకి తిన్న తర్వాత రాత్రిపూట అలా నడుచుకుంటూ వెళ్లి అరటిపండు తినడం అలవాటు. వాళ్ళ బాబాయ్ ఎప్పుడు బయటకు వెళ్లినా సౌర్యమ్మ కూడా బయటకు వెళ్తుంది తన అమ్మానాన్నలు కనిపిస్తారు ఏమో అని అంటుంది చంద్రమ్మ. అప్పుడు సౌందర్య అది అంతే చంద్రమ్మ ఏదైనా అనుకుంది అంటే అది సాధించేవరకు మౌనంగా ఉండదు. కి వాళ్ళ నాన్న దాన్ని రౌడీ అని పిలుస్తాడు అని అంటుంది సౌందర్య. తర్వాత కార్తీక్ హాస్పిటల్ కి వెళుతుండగా మీరు ఎక్కడికి వెళ్లడానికి బయలుదేరగా ఇంతలో దీప అక్కడికి వచ్చి మీరు ఎక్కడికి వెళ్లడానికి వీలు లేదు మీరు నా కళ్ళ ముందే ఉండాలి అని అంటుంది.

Advertisement

అప్పుడు కార్తీక్ అలా కాదు దీప వెళ్లాలి లేకపోతే ప్రాబ్లంస్ వస్తాయి అని నచ్చ చెబుతాడు. ఆ తర్వాత పండరి టిఫిన్ తీసుకొని రావడంతో ఇద్దరూ టిఫిన్ తింటూ ఉండగా అప్పుడు దీప చెప్పడం మర్చిపోయాను నాకు గుండెల్లో మంటగా ఉంది డాక్టర్ బాబు అని అంటుంది దీప. అప్పుడు వెంటనే కార్తీక్ టెన్షన్ పడుతూ ఎప్పటినుంచి అనడంతో ఇవాళ పొద్దున్నుంచి అని అంటుంది. ఏం కాదు దీప అది ఎసిడిటీ అయి ఉంటుంది అంటాడు కార్తీక్.

Read Also : Karthika Deepam: సౌందర్యతో వెళ్లిపోయిన శౌర్య.. దీపను చూసి కుమిలిపోతున్న డాక్టర్ బాబు.?

Advertisement