Ali Basha: మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఈయన చాలా ఇంటర్వ్యూలు, షోలలో చాలా సరదగా ఉంటారు. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ తో జరిగిన షోలో కూడా ఆయన చాలా ఫన్నీగా కనిపించారు. కానీ అలీతో సరదాగా అనే షోలో తాజాగా రానున్న ఎపిసోడ్ లో మాత్రం ఆయన ఫైర్ అయినట్లు తెలుస్తోంది.
అయితే ఇటీవలే అల్లు అరవింద్ అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. ఇందులో ఆయన తన కుటుంబ వవిషయాల గురించి, తన మనవళ్ల గురించి సరదాగా మాట్లాడారు. ఈ క్రమంలోనే అలీ ప్రస్తుతం అల్లు ఫ్యామిలీ, చిరు ఫ్యామిలీల మధ్య ఏమైనా వివాదాలు ఉన్నాయా అని అడగ్గా.. అల్లు అరవింద్ హర్ట్ అయ్యారు. తనను షోకి పిలిచినప్పుడు సర్ ప్రైజింగ్ ప్రశ్నలు ఉంటాయని చెప్పారు కానీ ఇలాంటి వివాదాస్పదమైన ప్రశ్నలు అడుగుతున్నారేంటి అని అలీని అడగారు. దీని తర్వాత అల్లు అరవింద్ షో నుంచి వాక్ ఔటే చేసే పరిస్థితి ఏర్పడినట్టు చూపించారు.
అయితే ఈ వి,యంపై ఇప్పుడే ఇంకా ఎవరికీ క్లారిట లేదు. జనాలను ఆకర్షించడానికే ఇలాంటి ప్రోమోలు వదులుతారని చాలా మంది అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఈ ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు ఆగాల్సిందే.