Akash puri: డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ ఛార్మిలపై ఎప్పుడో ఏదో వార్త వస్తూనే ఉంటుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ, సీక్రెట్ రిలేషన్ లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తుంటాయి. అయితే ఇఫ్పటికే పూరికి పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉండటం.. వారు కూడా చాలా పెద్దవాళ్లు కావడం గమనార్హం. అయితే ఛార్మి, పూరిలు ప్రొడక్షన్ హౌస్ నడిపిస్తున్నందునే ఎక్కువగా వీరిద్దరూ కలిసి కనిపిస్తుంటారు. పార్టీలు, ఫంక్షన్ లలో కలిసి కనిపిస్తుంటారు. అందువల్లే వీరిద్దరి మధ్యా ఏదో ఉందంటూ వార్తలు వస్తుంటాయి. ఎంత మంది ఎలా మాట్లాడినా వారు ఏం పట్టించుకోకుండా వారి పని వారు చేస్కుంటూ వెళ్తారు. అయితే తాజాగా పూరి తన భార్య లావణ్యకు విడాకులు ఇవ్వబోతున్నారంటూ వార్తలు రాశారు పలు గాసిప్ రాయుళ్లు. దీనిపై హీరో ఆకాశ్ పూరి స్పందించారు.
అమ్మా నాన్న మధ్య గొడవలు, విడాకులు లాంటి విషయాలు తనకైతే తెలియదని.. ఇంట్లో విషయాలు మాకంటే బయట వారికే ఎక్కువ తెలుస్తున్నాయంటూ కామెంట్లు చేశారు. ఎంతో సంతోషంగా, ప్రేమగా కలిసున్న వారి తల్లిదండ్రుల మధ్య గొడవలు అని రాస్తుంటే నవ్వొస్తుందంటూ చెప్పారు. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని.. నాన్న చేతిలో ఏం లేని సమయంలో ఆయన కోసం వచ్చేసిందని… అలాంటిది వారు ఇప్పుడెలా విడిపోతారంటూ ప్రశ్నించారు. ఇలాంటి వార్తల్లో ఎంత మాత్రమూ నిజం లేదని కుండ బద్ధలు కొట్టారు. అలాగే ఛార్మి, తన నాన్న మంచి స్నేహితులని, కలిసి వ్యాపారం చేస్తున్నంత మాత్రాన ఇలా మాట్లాడడం సరికాదని స్పష్టం చేశారు.