...

Pre wedding diet : ప్రీ వెడ్డింగ్ పోయింది.. నయా ట్రెండ్ వచ్చేసింది!

Pre wedding diet :ట్రెండ్ ఎప్పుడూ మారుతూ ఉంటుంది. మారుతూ ఉండేదానినే ట్రెండ్ అంటారు. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. గతాన్ని పట్టుకు వేలాడతామంటే ప్రస్తుతం కుదరదు. ట్రెండ్ ను ఫాలో కావాల్సిందే లేదంటే పాత బడిపోతారు. ఓల్డ్ ఫ్యాషన్ అనిపించుకుంటారు. గతంలో పెళ్లి అంటే జస్ట్ పెళ్లి మాత్రమే. ముహూర్తానికి వివాహం జరిగిందా.. బంధుమిత్రులు వచ్చారా ఫోటోలు దిగామా.. ఆల్బమ్ తయారైందా.. పెళ్లి వీడియో వచ్చిందా అన్నట్టు ఉండేది పరిస్థితి. మొన్నటి దాకా.. పెళ్లికి ముందే పిల్లా పిలగాడు జంటగా ఫోటోలు దిగేవారు. దానిని ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అనేవారు. తర్వాత ఏదైనా సినిమా పాటకు డ్యాన్సులు చేసి వీడియో తీసుకునే వారు. ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా మారిపోతోంది.

Pre wedding diet :
Pre wedding diet :

ఇప్పటి వధూవరులూ ఎక్కువగా ఫిట్ నెస్ కే ప్రాధాన్యమిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రీ వెడ్డింగ్ డైట్ కల్చర్ పెరిగింది. పెళ్లి కుదిరిన ఆరు నెలల ముందు నుంచే పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు వ్యాయామం నుండి పోషకాహారం వరకు ప్రతీది నిపుణులు చెప్పినట్లుగా పాటిస్తున్నారు. వివాహ గడియలు దగ్గర పడుతున్నాయంటే చాలు నగరంల అమ్మాయిలు, అబ్బాయిలు జిమ్ లకు పరుగులు తీయడం సహజంగా మారింది. మజిల్స్, చెస్ట్ పెంచడంపై అబ్బాయిలు దృష్టి పెడుతుంటే.. ఫిట్ గా ఉండేందుకు, నడుము నాజూకుగా మారేందుకు అమ్మాయిలు కసరత్తులు చేస్తున్నారు. వ్యాయామమే కాదు ఫుడ్ విషయంలో కూడా కచ్చితంగా ఉంటున్నారు. అనవసర పదార్థాలు, కొవ్వు పదార్థాలు ఉండేవి ముట్టుకోవట్లేదు. నచ్చిన ఫుడ్ అయినా సరే పక్కన పెడుతున్నారు.