Intinti Gruhalakshmi June 21 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో లాస్య, నందు, గాయత్రీ అభి లు ఎలా అయినా అంకితను తీసుకురావాలి అని ప్లాన్ వేస్తారు.
ఈరోజు ఎపిసోడ్ లో అంకిత,అభి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అది చూసిన దివ్య బాధతో అనసూయ దంపతుల దగ్గరికి వెళ్లి వారికి ఆ విషయం చెప్పడంతో వారు ముగ్గురు కలిసి ఒక ప్లాన్ వేస్తారు. మొదట దివ్య, అంకిత దగ్గరికి వెళ్లి అంకితను నవ్వించే ప్రయత్నం చేయగా అంకిత అలాగే ఆలోచిస్తూ ఉంటుంది.

ఇంతలో అనసూయ ఆ తరువాత పరంధామయ్య దంపతులు వచ్చి అంకితను నవ్వించే ప్రయత్నం చేసినప్పటికీ అంకిత మాత్రం అలాగే బాధపడుతూ ఉంటుంది. ఇక వారు ముగ్గురు వెళ్లి తులసికి అసలు విషయం చెప్పడంతో తులసి ఒక కథను చెప్పి అంకితను నవ్విస్తుంది. అంకిత నవ్వడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఇంతలోనే అక్కడికి నందు వచ్చి తులసి అంటూ గట్టిగా అరుస్తాడు. తులసి కుటుంబం అంతా బయటకు వెళ్లడంతో నందు అంకిత ని ఎందుకు ఇంట్లోకి తీసుకు వచ్చావు తన తల్లి దగ్గరికి పంపించు అని అనడంతో వెంటనే తులసీ నేను అంకితను తీసుకొని రాలేదు రమ్మని కూడా చెప్పలేదు వచ్చిన తర్వాత పంపించే అర్హత కూడా నాకు లేదు అని అనడంతో వెంటనే లాస్య నీ పెద్ద కొడుకుని నువ్వు చెప్పి ఇంట్లో నుంచి బయటికి పంపించేశావు.
చిన్న కొడుకుని అలాగే పంపించేశావు. అలాంటిది నువ్వు పిలవకుండానే అంకిత వచ్చిందా అని లాస్య అనడంతో వెంటనే అంకితం నన్ను ఎవరు పిలవలేదు నేను ఇక్కడికి వచ్చాను అని అనగా వెంటనే గాయత్రీ ఎందుకు వచ్చావు మన ఇంటికి వెళదాం పద అని అంటుంది.
కానీ అంకిత మాత్రం వెళ్లడానికి నిరాకరించడంతో వెంటనే లాస్య మాటలతో కాదు పట్టుకుని లాక్కెళ్లి అని అనగా వెంటనే తులసి మధ్యలో అడ్డుకర్ర వేసి ఆ గీత దాటి ఎవరు అంకితను తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసినా ఇక్కడ కురుక్షేత్రం జరుగుతుంది అంటూ కళ్ళు ఎర్ర చేస్తుంది. అప్పుడు అవి మాట్లాడుతూ ఏ అత్తా కోడలిని ఇలా చూడదు అంటూ వెటకారంగా మాట్లాడతాడు.
అంకిత జీవితాన్ని కూడా నీలాగే మార్చేద్దాం అనుకుంటున్నావా అని అంటాడు. వెంటనే అంకిత అభి పైన విరుచుకు పడుతుంది. అప్పుడు అభి కూడా అంకిత పై అరుస్తాడు. అప్పుడు అనసూయ పరంధామయ్య లు నందు గట్టిగా బుద్ధి చెబుతారు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Intinti Gruhalakshmi june 2 Today Episode : ప్రేమ్ ని అవమానించిన నందు.. బాధతో కుమిలిపోతున్న అంకిత..?