Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Guppedantha Manasu: మహేంద్ర, జగతిలను చూసి కన్నీళ్లు పెట్టిన వసు, రిషి.. టెన్షన్ పడుతున్న గౌతమ్?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిం

By Ramesh Babu

Published on: November 25, 2022 10:35 AM

Updated on: November 25, 2022 10:09 AM

---Advertisement---

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసుధర రిషి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్లో రిషి ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో దేవయాని అక్కడికి వచ్చి ఏంటి నాన్నా రిషి ఇది జగతి వాళ్లు వస్తానని చెప్పి నువ్వు అన్నం తినకుండా కాఫీ కూడా తాగకుండా అలాగే ఉంటే ఎలా కనీసం కాఫీ అయిన తాగుదురా రిషి అని అనడంతో వద్దు పెద్దమ్మ డాడ్ వాళ్లు వచ్చాక తాగుతాను అని అనడంతో సరేలే రిషి కిందికి వెళ్దాం పద అనడంతో మీరు వెళ్ళండి పెద్దమ్మ అని అంటాడు. అది కాదు రిషి మీకోసం మీ పెదనాన్న కింద వెయిట్ చేస్తున్నాడు వెళ్దాం పద అని రిషి ని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తుంది.

Advertisement

Rishi and vasu get emotional in todays guppedantha Manasu serial episode

మరొకవైపు హాస్పిటల్ లో గౌతమ్ టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో డాక్టర్ అక్కడికి రావడంతో డాక్టర్ వాళ్లకు బాగానే ఉంది కదా అనడంతో ఆమెకు చాలా బ్లడ్ పోయింది వెంటనే ఆమెకు బ్లడ్ కావాలి అని చెప్పడంతో సరే అని అంటాడు గౌతమ్. మరొకవైపు రిషి టెన్షన్ పడుతూ ఉండగా అప్పుడు వసుధార సర్ ఏం కాదు సార్ జగదీష్ మేడం వాళ్ళు ఇంటికి వస్తారు మీరు భయపడకండి అని ధైర్యం చెబుతుంది. ఇంతలోనే గౌతమ్ ఫోన్ చేయడంతో చెప్పు గౌతమ్ అని అనగా రిషి నువ్వు నాకు ఒక స్మాల్ హెల్ప్ చేయాలి అర్జెంటుగా నువ్వు హాస్పిటల్ కి రావాలి అని అనడంతో స్వారీ గౌతమ్ నేను డాడ్ వాళ్ల కోసం ఎదురుచూస్తున్నాను ఇప్పుడు రాలేను అని అంటాడు.

అప్పుడు గౌతమ్ ప్లీజ్ రిషి నీ అవసరం ఇక్కడ చాలా ఉంది తొందరగా రా అని నువ్వు వస్తున్నావు అంతే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత రిషి ఏంటి వీడు వసుధార ఇలా చేస్తున్నాడు అని రిషి ఫోన్ చెక్ చేసుకోగా చాలాసార్లు మిస్డ్ కాల్స్ ఉండడంతో వెంటనే వసుధార సార్ అక్కడ గౌతమ్ సార్ ఎంత ఇబ్బంది పడుతున్నారు వెళ్దాం పదండి సార్ అని అంటుంది. మరొకవైపు గౌతమ్ రిషి వస్తాడో లేదో అని హాస్పిటల్ లో టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత వసుధార రిషి ఇద్దరు కారులో వెళ్తుండగా ఇప్పుడు మనం ఇద్దరూ హాస్పిటల్ కి వెళ్తే ఒకవేళ డాడ్ జగతి మేడం వాళ్ళు ఇంటికి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి వసుధార అని అనగా అప్పుడు వసుధార అదే నాకు అర్థం కావడం లేదు సార్.

కానీ గౌతమ్ సార్ అన్ని సార్లు కాల్ చేశారంటే అక్కడ ఏదో సమస్య ఉండి ఉంటుంది కదా అని ఇద్దరు కలిసి హాస్పిటల్ కి వెళ్తారు. అప్పుడు హాస్పిటల్ కి వెళ్ళిన రిషి ఏంట్రా ఎందుకు రమ్మన్నావు అసలు ఏం జరిగింది అనగా అప్పుడు గౌతమ్ మహేంద్ర సార్ వాళ్లు అని అనడంతో ఏమైందిరా డాడ్ వాళ్లకు చెప్పు అని అనగా అప్పుడు గౌతమ్ మహేంద్ర వాళ్ళని చూపించడంతో రిషి వసుధారలు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ తర్వాత రిషి లోపలికి వెళ్ళగా డాడ్ మీకు ఏమైంది డాడీ అసలు ఏం జరిగింది ఎక్కడికి వెళ్తున్నారు అనడంతో నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఆక్సిడెంట్ జరిగింది రిషి అంటూ మహేంద్ర జరిగింది మొత్తం వివరిస్తాడు.

Advertisement

అప్పుడు వసుధార జగతి మేడం ఎక్కడ అని అనగా జగతిని చూపించడంతో వసుధర,రిషి ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు వసుధార ఎమోషనల్ అవుతూ మేడం లేవండి మేడం ఏం జరిగింది మేడం సార్ మేడం లేవడం లేదు సార్ అని ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి డాక్టర్ వస్తాడు. ఈమెకు అర్జెంటుగా బ్లడ్ కావాలని చెప్పాను కదా హలో ఎల్లో షర్ట్ మీకే చెప్పాను కదా ఏం చేస్తున్నారు అని అడుగుతాడు డాక్టర్. అప్పుడు డాక్టర్ ఓ నెగటివ్ అది చాలా రేర్ గా దొరుకుతుంది అనడంతో వెంటనే రిషి డాక్టర్ గారు నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ నేను ఇస్తాను అని ముందుకు వెళ్లడంతో వసుధార మహేంద్ర వాళ్ళు సంతోష పడుతూ ఉంటారు. ఆ తర్వాత జగతికి రిషి బ్లడ్ ఇస్తాడు. అప్పుడు వసుధార ఎమోషనల్ అవుతూ ఉండగా రిషి ధైర్యం చెబుతాడు. మరొకవైపు గౌతమ్ మహేంద్ర వాళ్లు కూడా ఆ తర్వాత జగతి దగ్గరికి వెళ్లి మీ రక్తం పంచుకు పుట్టిన కొడుకే మీకు ఈరోజు బ్లడ్ ఇస్తున్నారు అని అంటుంది.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.