Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Janaki Kalaganaledu: జానకి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్న రామచంద్ర.. టెన్షన్ పడుతున్న జ్ఞానాంబ..?

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకీ కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో

By Ramesh Babu

Published on: July 5, 2022 11:44 AM

Updated on: July 5, 2022 1:05 PM

---Advertisement---

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకీ కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జానకి భోజనం చేసి అందరికీ వడ్డిస్తూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో జానకి అందరికీ భోజనం వడ్డిస్తూ ఉండగా దూరం నుంచి అది చూసిన మల్లిక నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జానకి తొందర తొందరగా గదిలోకి వెళ్లి అసైన్మెంట్ వర్క్ ని పూర్తి చేసుకుంటుంది. అలా మొత్తానికి అసైన్మెంట్ వర్క్ పూర్తి అవడంతో జానకి సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు రామచంద్ర స్వీట్లు ఇచ్చేసి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఇంతలో జ్ఞానాంబ, రామచంద్ర కు ఫోన్ చేసి పక్క ఊరిలో డబ్బులు వసూలు చేయమని చెప్పగా రామచంద్రస్వామి అని ఫోన్ కట్ చేసి జానకి గురించి ఆలోచిస్తూ ఉంటాడు.

Advertisement

jnanamba gets worried when she learns about Govindarajus health condition in todays janaki kalaganaledu serial episode

ఆ తర్వాత జానకికి ఫోన్ చేసి అమ్మ బాకీ కోసం వెళ్లమని చెప్పింది మరి మీరు అక్కడికి ఎలా వెళ్తారు అని అనగా వెంటనే జానకి నేను ఎలాగో అలా ఆటోలో వెళ్తాను అని అనడంతో వెంటనే రామచంద్ర ఆటోలో అస్సలు వెళ్ళకండి అని అంటాడు. దాంతో జానకి నాకు ఏం కాదు నేను కాబోయే ఆఫీసర్ ని ఆ మాత్రం ధైర్యం ఉండదా అని రామచంద్ర కు ధైర్యం చెప్పి అసెస్మెంట్ ఇవ్వడానికి బయలుదేరుతుంది.

మరొకవైపు గోవిందరాజులు కి ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. నడుము నొప్పితో బాధపడుతూ టాబ్లెట్లు తెచ్చుకోవడానికి వెళుతూ ఉంటాడు. అప్పుడు జానకి తాను టాబ్లెట్లు తీసుకుని వస్తాను అని చెప్పి స్లిప్ తీసుకుని వెళుతుంది. ఇంతలోనే అక్కడికి జ్ఞానాంబ వచ్చి ఏం జరిగింది అనడంతో నడుము నొప్పి అనడంతో వెంటనే జ్ఞానాంబ టెన్షన్ పడుతూ ఉంటుంది.

ఇంతలోనే అక్కడికి వచ్చిన మల్లికా జానకి ఎక్కడికి వెళ్తుందో, అంటూ జానకి పై లేనిపోని మాటలు చెబుతుంది. అప్పుడు జ్ఞానాంబ ఎందుకమ్మా అని అడగగా వెంటనే గోవిందరాజులు ఈ మధ్యకాలంలో అమ్మాయిలు బ్యాగులు వేసుకుని వెళ్తున్నారు లే అని చెబుతారు. ఆ తర్వాత జానకి అసైన్మెంట్ ఇవ్వడానికి వెళ్ళగా ఆలస్యం కావడంతో అక్కడున్న వ్యక్తి తీసుకోవడానికి నిరాకరిస్తాడు.

Advertisement

అప్పుడు జానకి జరిగింది మొత్తం తన బాధలు వివరించడంతో అతడు అర్థం చేసుకుని అసైన్మెంట్ ను తీసుకుంటాడు. ఆ తర్వాత జానకి టాబ్లెట్స్ కోసం మెడికల్ షాపులు తిరుగుతూ ఉంటుంది. అందులో ఒక ఇంజక్షన్ ద్వారా తన మామయ్యకి నడుము నొప్పి అని తెలుసుకుంటుంది. మరొకవైపు గోవిందరాజులు నొప్పి ఎక్కువ కావడంతో ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు.

జానకి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత జ్ఞానాంబ రామచంద్ర కి ఫోన్ చేసి డాక్టర్ ను తీసుకుని రమ్మని చెబుతుంది. జానకి ఎంతసేపటికి రాకపోవడంతో మల్లిక మరిన్ని చాడీలు చెబుతూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి గోవిందరాజులు పరిస్థితి క్షీణించిపోతుంది అని చెప్పడంతో ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.