Karthika Deepam: జ్వాలాని చూసి ఫిదా అయిన ప్రేమ్, నిరూపమ్.. బాధలో హిమ..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆనందరావు, సౌందర్య ఇంటికి వచ్చిన స్వప్న, హిమ, సౌందర్య లను నానా మాటలు అని బాధ పెడుతుంది. నాకు మమ్మీ లేదు డాడీ మాత్రమే ఉన్నాడు అని అనడంతో సౌందర్యం మరింత బాధ పడుతుంది. ఆ తర్వాత స్వప్న మాటలకు బాధపడుతున్న హిమ ను ఆనందరావు, సౌందర్య ఓదారుస్తూ ఉంటారు.

Advertisement

అప్పుడు హిమ జీవితాంతం ఇలా బాధపడుతూనే మాటలు పడుతూనే ఉండాలన నానమ్మ అని అంటుంది. ఇంతలో అక్కడికి నిరూపమ్ వస్తాడు. స్వప్న చేసిన పనికి హిమ కు సారీ చెబుతాడు నిరూపమ్. మరొకవైపు జ్వాల, సత్య కి భోజనం తీసుకుని వెళ్తుంది.

ఆ తర్వాత మీరు మీ భార్యకు ఎందుకు దూరంగా ఉంటున్నారో ఇప్పుడు అర్థం అయింది సార్ అని అంటుంది. అప్పుడు సత్యం మాట్లాడుతూ గుడిలో జరిగిన దానికి నేను క్షమాపణ చెబుతున్నాను అని అంటాడు. మరొకవైపు మౌనిక కొడుకు ఆనంద్ ని అరుణ వాళ్ళ అక్క కొడుతూ, తిడుతూ ఉంటుంది.

ఆనంద్ ని అరుణ వాళ్ళ అక్క దారుణంగా మాట్లాడుతూ కుక్క కంటే హీనంగా చూస్తూ ఉంటుంది. కార్తీక్,మోనిత ఫోటోలను చూస్తూ ఆనంద్ ఏడుస్తూ ఉంటాడు. నా తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు అని వివరాలను అడగగా, అప్పుడు అరుణ కోపంతో ఆనంద్ ఫై అరిచి అక్కడ నుంచి వెళ్లి పోతుంది.

Advertisement

మరొకవైపు జ్వాలా బస్తీ లో ఉన్న ఇంటికి వెళ్లగా అక్కడ ఒక ముసలావిడ  ఆ ఇంట్లో దెయ్యం ఉంది అని మాట్లాడగా అప్పుడు జ్వాలా సీరియస్ అవుతుంది. ఆ తర్వాత జ్వాల ఒక ఆవిడను ఆటోలో ఎక్కించుకొని అమ్మమ్మ,తాతయ్య వాళ్ళ ఇంటికి తీసుకుని వెళుతుంది. అక్కడ సౌందర్య, ఆనంద్ లను చూసి షాక్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ద్వారా అందంగా చీర కట్టుకొని తయారవుతుంది. అది చూసిన నిరూపమ్, ప్రేమ్ ఫిదా అవుతారు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel