Vastu Tips : లక్ష్మీదేవి కటాక్షం పొంది ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ఈ నాలుగు పనులు చేస్తే సరి..!

Updated on: August 15, 2022

Vastu Tips : దేశం రోజురోజుకీ అభివృద్ధి చెంది సాకేతిక పరిజ్ఞానం పెరుగుతోంది. అందువల్ల గురించి తేలికగా తీసుకుంటున్నారు. అయితే పురాణాల ప్రకారం మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మనం చెసే పనులతో పాటు, జాతకం మీద ఆధారపడి ఉంటుందని సూచిస్తున్నారు.జీవితంలో ఏం జరిగినా కూడా చాలామంది మన జాతకం బాగొలేకపోవటం వల్ల ఇలా జరుగుతుందని భారం మొత్తం దేవుడి వేస్తుంటారు. అయితే మన జాతక దోషమే కాకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి మనం చేసే ఈ చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకుంటే సరిపోతుంది.

పురాణాల ప్రకారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో చీపురుతో ఉడ్చి ఇల్లు శుభ్రం చేయరాదు. ఇలా చేయటం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం ఉండదు. సాయంత్రం సూర్యుడు అస్తమించటానికి ముందే ఇళ్లు శుభ్రం చేసుకొని స్నానం చేసి దీపారాధన చేయటం వల్ల లక్ష్మి దేవి అనుగ్రహం కలిగి ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇల్లు శుభ్రం చేయరాదు.

అలాగే మన ఇంటి పరిసర ప్రాంతాలతో పాటు బహిరంగ ప్రదేశాలలో కూడా మనం పొరపాటున ఉమ్మి వేయరాదు. ఇలా ఇంటి పరిసర ప్రాంతాలలో ఉమ్మి వేయడం అసభ్యతకు చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ఇంటి పరిసర ప్రాంతాలలో కానీ, గుడి ప్రాంగణంలో కానీ ఉమ్మి వేయటం వల్ల మనపై లక్ష్మి దేవి అనుగ్రహం ఉండదు. అందువల్ల మనం కష్టపడి సంపాదించిన డబ్బు కూడా ఏదో ఒక రూపంలో ఖర్చయిపోయి ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల పొరపాటున కూడా ఇలా బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయటం చేయరాదు.

Advertisement
vastu tips vastu-tips-if-you-want-to-get-blessings-of-goddess-lakshmi-and-get-rid-of-financial problems at home you should do these four things
vastu tips vastu-tips-if-you-want-to-get-blessings-of-goddess-lakshmi-and-get-rid-of-financial problems at home you should do these four things

Vastu Tips:

సాధారణంగా ఇంట్లో దేవుడి గదిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని అందరూ భావిస్తారు. దేవుడి గదితో పాటు ఇల్లు మొత్తం ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా బాత్రూం కూడా ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బాత్రూమ్ ని చంద్రుడి ప్రవేశంగా భావిస్తారు. బాత్రూం శుభ్రంగా లేకపోవడం వల్ల అనేక వ్యాధులతో పాటు చంద్రగ్రహణం కూడా మనపై పడుతుంది. దీంతో ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి. అందువల్ల ఇంటితోపాటు బాత్రూం కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత తిన్న పాత్రలను అలాగే ఉంచడం వల్ల ఇంటికి అరిష్టం. రాత్రి భోజనం చేసిన తర్వాత పాత్రలను శుభ్రంగా కడిగి ఉంచుకొని ఉదయం లేవగానే ఇల్లు శుభ్రం చేయటం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలై మనపై లక్ష్మీదేవి కనికరం చూపిస్తుంది. దీంతో ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు ఉంటాయి.

Advertisement

Read Also : Mirror Vastu Tips : ఇంట్లో అద్దం ఆ వైపు పెడితే భార్యభర్తలు విడిపోతారట.. మరోవైపు పెడితే అల్లకల్లోలమే..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel