Samantha : చైతూతో బ్రేకప్.. సోలోగా ఉండే సమంత మకాం ఇకపై అక్కడేనంట!

Updated on: August 4, 2025

samantha naga chaitanya divorce reason : అందమైన టాలీవుడ్ జంట.. అన్యోన జంటగా ఎందరికో ఆదర్శంగా నిలిచిన నాగచైతన్య, సమంత. ఊహించిన రీతిలో ఈ లవ్‌లీ కపుల్ తమ వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేశారు. అక్టోబర్ 2న సమంత, నాగచైతన్యలు డివోర్స్ తీసుకున్నట్టు ప్రకటించారు. ఇద్దరూ ఒకే మెసేజ్ తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. ఈ వార్తను ఒక అక్కినేని అభిమానులను మాత్రమే కాదు.. సమంత ఫ్యాన్స్ సహా చై-సామ్ అందరూ జీర్ణించుకోలేకపోయారు.
Aadharam Movie : ‘ఆధారం’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది..

samantha naga chaitanya divorce reason
samantha naga chaitanya divorce reason

ఇది అబద్దమైతే బాగుండు అనుకున్నవారు లేకపోలేదు. కానీ, చై-సామ్ తమ వివాహ బంధానికి బ్రేకప్ చెప్పి అందరిని షాకిచ్చారు. అప్పటినుంచి సమంత, నాగచైతన్యలదే హాట్ టాపిక్ నడుస్తోంది. టాలీవడు్ మోస్ట్ క్రేజీ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ లవ్ లీ కపూల్ ఇప్పుడు ఎవరికి వారు సోలోగా ఉంటున్నారు. చై-సామ్ విడిపోవడానికి బలమైన కారణం ఏంటి? వారిద్దరి మధ్య ఏం జరిగింది? అన్నదే టాపిక్ నడుస్తోంది. చైతూ నుంచి విడిపోయినప్పటి నుంచి సమంత సోలోగానే ఉంటోంది.

samantha and chaitanya marriage
samantha naga chaitanya divorce reason

మొన్నటిదాకా సోలాగా ఉన్న సమంత ఇప్పుడు ముంబైకి మకాం మారనుందని అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలను సమంత కూడా కొట్టిపారేసింది. తాను ఎక్కడికి వెళ్లడం లేదని హైదరాబాద్ తన ఇల్లు అని ఇక్కడే ఉంటానని సామ్ స్పష్టం చేసింది. టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. గచ్చిబౌలిలోని ఓ ప్లాట్‌కు సమంత షిఫ్ట్‌ అవుతుందంట..

Advertisement

ఇకపై అక్కడే సమంత సోలోగా ఉండనుందని సన్నిహిత వర్గాలు ద్వారా తెలిసింది. సమంత నటించిన ‘శాకుంత‌లం’ మూవీ షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి అయింది. ప్ర‌స్తుతం కాతువాకుల రెండు కాదల్ అనే మూవీలో నటిస్తోంది సమంత. ఈ మూవీ షూటింగ్ కోసం కొన్నిరోజులుగా చెన్నైలోనే ఉంటోంది.
Read More :  Manchineel Tree Dangerous : మనిషి ప్రాణాలు తీసే చెట్టు.. అంతా విషమే.. గాలి పీల్చినా, నీటి చుక్క పడినా ప్రాణాలు పైకే!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel