G
Telugu News » Trending » crying sister consolling by brother has gone viral on social media
⚡ Trending, Latest

Brother – Sister Love : అన్నాచెల్లెలి ప్రేమ అంటే ఇది.. కావాలంటే చూడండి

Brother - Sister Love , sister and brother video, Sibling love, Viral Video, viral video of siblings, అన్నాచెల్లెల్ల అనుబంధం, అన్నాచెల్లెలి ప్రేమ,telugu news

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Brother – Sister Love :  అన్నాచెల్లెల్ల మధ్య అనుబంధం గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఆ ప్రేమ సందర్భానుసారం బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడూ కొట్టుకుంటున్నా వారి మధ్య బలమైన బంధం ఉంటుంది. ఇంకెవరైనా చిన్న మాట అన్నా మిగతా వాళ్లు అస్సలే ఊరుకోరు. అలాంటి సమయంలోనే నిజమైన ప్రేమ అంటే ఏమిటో మిగతా వారికి తెలిసి వస్తుంది. అలా జరిగిన ఓ ఘటనపై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అసలేం జరిగిందో తెలియాలంటే ఇది చదవండి.

Brother – Sister Love : crying sister consolling by brother has gone viral on social media

ఇద్దరు చిన్న పిల్లలు బాస్కెట్ బాల్ తో ఆడుకుంటున్నారు. చెల్లెలు బంతితో ఆడుకుంటుండగా అక్కడికి వచ్చిన అన్న తన చేతిలోని బంతిని తీసుకుని బాస్కెట్ బాల్ గోల్ వేస్తాడు. అయితే తన చేతిలో బంతిని తీసుకున్నందుకు ఆ పాప ఏడుస్తుంది. గోల్ వేసిన తర్వాత ఆ బాస్కెట్ బాల్ ను తిరిగి ఆమె చేతికి అందించినా తను మాత్రం ఏడుపు ఆపదు. తర్వాత తను కూడా గోల్ వేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ గోల్ వేయలేక పోతుంది.దీంతో ఆ పాపాయి మళ్లీ ఏడుపు లంకించుకుంటుంది. అప్పుడు ఆ అబ్బాయి తన చెల్లెలిని ఎత్తుకుని గోల్ వేయిస్తాడు. తర్వాత ఆ పాప నవ్వుతుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అన్నాచెల్లెల్ల ప్రేమ అంటే ఇలా ఉండాలంటూ పలువురు నెటిజన్లు ఆ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Big Bros 💙 pic.twitter.com/dIwIDWVnUn

— CCTV_IDIOTS (@cctv_idiots) July 20, 2022

Read Also : Viral Video : చెల్లి మీద ఆ బుడ్డోడికి ఉన్న ప్రేమ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే!

Advertisement

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Sibling lovesister and brother videoViral Videoviral video of siblings
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు