Aunty Workout: 56 ఏళ్ల వయసులోనూ చీర కట్టుకొని జిమ్ చేస్తున్న ఆంటీ.. మామూలుగా లేదుగా!

Updated on: November 26, 2022

Aunty Workout: సోషల్ మీడియాలో రోజురోజుకూ రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎన్ని రకాల వీడియోలు వచ్చిన కొన్ని మాత్రమే మన మనసును తాకుతాయి. అందులో మనం ఇన్ స్పైర్ అయ్యే వీడియోలు అయితే మరీ ఆసక్తిగా చూస్తుంటాం. అయితే అలాంటి ఓ వీడియోనే నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారింది. అదేంటో మనంం ఇప్పుడు తెలుసుకుందాం.

ఓ 56 ఏళ్ల వయసున్న మహిళ చీర కట్టుకుని ఆరు బయట జిమ్ లో వర్కవుట్ చేస్తున్న వీడియో నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టింది. ఈ తల్లి తన కోడలుతో కలిసి జిమ్ లో క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ.. వారి వయసు లేదా దుస్తులను అడ్డంకిగా ఉంచకుండా అలాగే చేశారు. చీర కట్టుకునే వెయిట్ లిఫ్టింగ్ చేస్తోంది. డెడ్ లిఫ్టులు, కెటిల్ బెల్ రోలు, బెంచ్ ప్రెస్ లు, స్క్వాట్ లు చేస్తోంది.

Advertisement

నాలుగేళ్ల క్రితం తీవ్రమైన మోకాళ్లు, కాళ్ల నొప్పులు మొదయ్యాయి. వాటిని తగ్గించుకునేందుకు ఆమె జిమ్ లో చేరారు. అప్పటి నుంచి ప్రతీరోజూ చీర కట్టుకునే జిమ్ కు వెళ్తోంది ఆ ఆంటీ. కష్టమైన వ్యాయామాన్ని కూడా చూస్తూ… అందిరి చేత ఔరా అనిపిస్తోంది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.5 మిలియన్ల మంది వీక్షించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel