Bike Engine Oil : బైకర్లు జర జాగ్రత్త.. ఆయిల్ మార్చకపోతే మీ బైక్ ఇంజిన్ దెబ్బతింటుంది.. ఎప్పుడు మార్చాలో తెలుసా?

Updated on: August 16, 2025

Bike Engine Oil : మీకు బైకు ఉందా? మీ బైకులో ఏదైనా తేడాను గమనించారా? ఇంజిన్‌లో సౌండ్ వస్తుందా? అయితే, అసలు నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే (Bike Engine Oil) మీ బైకు ఇంజిన్ దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంది. ప్రస్తుత రోజుల్లో చాలామంది బైకులను పట్టించుకోరు. అలానే నడిపేస్తుంటారు.

మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లే.. మీ బైక్ లేదా కారును కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ కొంచెం అజాగ్రత్త వహించినా మీ వాహనం ఇంజిన్‌ను పూర్తిగా దెబ్బతీస్తుంది. చాలా మంది బైకులో ఇంజిన్ ఆయిల్ మార్చరు.

అలాగే బైకును నడుపుతూ ఉంటారు. ఇంజిన్ ఆయిల్ మార్చకపోవడం వల్ల వాహనం ఎలా దెబ్బతింటుంది? ఇంజిన్ ఆయిల్ (బైక్ ఇంజిన్ ఆయిల్ మార్పు) మార్చడం ఎప్పుడు మంచిది అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

Advertisement

Bike Engine Oil : నిర్లక్ష్యంతో ఇంజిన్‌కు దెబ్బ:

బైక్‌లో అతి ముఖ్యమైన భాగం ఇంజిన్.. అలాంటి ఇంజిన్‌ను మంచి కండిషన్‌లో ఉంచుకోవాలి. అలా ఉండాలంటే ఇంజిన్ ఆయిల్ అవసరం. చాలా సార్లు వాహనదారులు ఇంజిన్‌పై పెద్దగా శ్రద్ధ చూపరు. దీనివల్ల భారీ నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.

Read Also : MG Windsor EV : కొంటే ఇలాంటి కారు కొనాలి.. జస్ట్ రూ. 2 లక్షల డౌన్‌పేమెంట్‌తో MG విండ్సర్ EV ఇంటికి తెచ్చుకోవచ్చు!

బైకు మేకర్లు ప్రతి బైక్‌తో మాన్యువల్ బుక్ లేదా ఇ-మాన్యువల్‌ను అందిస్తారు. బైక్‌లో ఏ రకమైన ఇంజిన్ ఆయిల్‌ను ఉపయోగించాలి? ఎప్పుడు మార్చాలో స్పష్టంగా పేర్కొంటుంది. మీరు మాన్యువల్‌ను జాగ్రత్తగా చదివితే.. ఇంజిన్ ఆయిల్‌ను సకాలంలో మార్చడం వల్ల బైక్ లైఫ్ టైమ్, పర్ఫార్మెన్స్ రెండూ పెరుగుతాయి.

Advertisement

Bike Engine Oil : ఇంజిన్ నుంచి శబ్దం వస్తుందా? :

మీ బైక్ అకస్మాత్తుగా సాధారణం కన్నా ఎక్కువ సౌండ్ చేయడం ప్రారంభిస్తే.. అది ఇంజిన్ ఆయిల్ చెడిపోయిందని సంకేతం. కొత్త ఇంజిన్ ఆయిల్ వేయడం వల్ల శబ్దం తగ్గుతుంది. పాడైన ఆయిల్ ఇంజిన్ శబ్దాన్ని పెంచుతుంది.

ఇంజిన్ వేడెక్కుతుందో లేదో చెక్ చేయండి :

బైక్ వేగంగా వేడెక్కడం మొదలైతే అది ఇంజిన్ ఆయిల్ పాడైందని అర్థం. లేదంటే ఆయిల్ లెవల్ తగ్గిపోయిందని కూడా సూచిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఇంజిన్‌పై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.

అదేగానీ జరిగితే ఇంజిన్ కూడా దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల, ఓవర్ హీటింగ్ వంటి సమస్య కనిపించిన వెంటనే ఇంజిన్ ఆయిల్‌ను చెక్ చేసి అవసరమైతే వెంటనే కొత్త ఆయిల్‌తో మార్చేయండి.

Advertisement

మీ బైక్‌కు ఆయిల్ మార్పును సూచించే 5 సంకేతాలివే :

1. ఇంజన్ నాయిస్
ఇంజన్ నార్మల్‌గా కన్నా ఎక్కువ సౌండ్ చేస్తుంది. ముఖ్యంగా స్టార్టప్‌లో లేదా ఫాస్ట్ డ్రైవ్‌లో సౌండ్ వస్తుంది.

2. డార్క్ లేదా డర్టీ ఆయిల్
డిప్ స్టిక్ చెక్ చెయ్యండి. ఫ్రెష్ ఆయిల్ గోల్డ్ కలర్‌లో ఉంటుంది. పాత ఆయిల్ బ్లాక్ అండ్ డర్టీగా ఉంటుంది.

3. తగ్గిన మైలేజ్
అదే రైడ్ స్టైల్‌తో కూడా పెట్రోల్ ఎక్కువ అయిపోతుంది. మైలేజ్ కూడా తగ్గుతుంది.

Advertisement

4. ఓవర్ హీటింగ్ ఇంజన్
ఇంజన్ చాలా స్పీడ్‌గా హీట్ అవుతుంది. లేకుంటే డిస్‌ప్లేలో హీట్ వార్నింగ్ చూపిస్తుంది.

5. స్లో గేర్ షిఫ్ట్‌లు లేదా యాక్సిలరేషన్ 
బైక్ రన్ చేయడం స్లోగా ఉంటుంది. గేర్ షిఫ్ట్ స్మూత్‌గా ఉంటుంది. బైక్ హెవీగా అనిపిస్తుంది.

మీ బైకులో ఇంజిన్ ఆయిల్ మార్చాలంటే? (5 Signs Your Bike Needs an Oil Change) FAQs

1. బైక్ ఇంజిన్ ఆయిల్‌ను ఎప్పుడు మార్చాలి?

చాలా బైక్‌లకు ప్రతి 2,500 నుంచి 3,000 కిలోమీటర్లకు లేదా ప్రతి 3 నెలల నుంచి 4 నెలలకు ఏది ముందు వస్తే దాని ప్రకారం ఇంజిన్ ఆయిల్ మార్చవలసి ఉంటుంది. సింథటిక్ ఆయిల్స్ కోసం విరామం 5,000 కి.మీ వరకు విస్తరించవచ్చు.

2. బైక్ ఇంజిన్ ఆయిల్ ఎన్ని రోజుల తర్వాత మార్చాలి?

సాధారణంగా, కిలోమీటర్ పరిమితిని చేరుకోకపోయినా ప్రతి 90 రోజుల నుంచి 120 రోజులకు ఒకసారి ఇంజిన్ ఆయిల్ మార్చాలి. ఎందుకంటే కాలక్రమేణా ఆయిల్ క్షీణిస్తుంది.

3. బైక్ ఇంజిన్ పాడైందని సంకేతాలు ఏంటి?

* ఇంజిన్ శబ్దం లేదా కంపనం
* ముదురు, మురికి ఆయిల్
* మైలేజ్ తగ్గడం
* వేడెక్కడం
* గేర్ షిఫ్టింగ్ కఠినంగా ఉండటం

4. ఆయిల్ మార్పునకు సమయం ముఖ్యమా? కిలోమీటర్లు ముఖ్యమా?

రెండూ ముఖ్యమైనవే. మీరు రోజూ రైడ్ చేస్తుంటే.. కి.మీ. ఆధారిత గ్యాప్ ఫాలో చేయండి. బైక్ అరుదుగా వాడితే కి.మీ. పరిమితిని చేరుకోకపోయినా ఆయిల్ బ్రేక్‌డౌన్‌ కోసం సమయ ఆధారితంగా ఆయిల్ మార్పులు చేయండి.

5. బైక్ ఇంజిన్ ఆయిల్ మార్చడంలో ఆలస్యమైతే ఏంటి? :

ఆయిల్ మార్పు ఆలస్యమైతే ఈ కింది సమస్యలు రావచ్చు.
* ఇంజిన్ వేర్
* బురద పేరుకుపోవడం
* పెరిగిన ఇంధన వినియోగం
* ఇంజిన్ వేడెక్కడం
* కాలక్రమేణా ఇంజిన్ దెబ్బతినడం

6. నేను ఇంట్లో బైక్ ఇంజిన్ ఆయిల్ మార్చవచ్చా?

అవును.. ప్రాథమిక టూల్స్ ద్వారా ఇంజిన్‌ను వేడి చేయండి. పాత ఆయిల్ తీసివేయండి. సరైన గ్రేడ్ ఫ్రెష్ ఇంజిన్ ఆయిల్‌తో నింపండి. చేతి తొడుగులు ఉపయోగించండి. పాడైన ఆయిల్ దూరంగా పారవేయండి.

7. బైక్‌లకు ఏ రకమైన ఇంజిన్ ఆయిల్ బెస్ట్?

మినరల్ ఆయిల్ : పాత బైక్‌లు లేదా తక్కువ పర్ఫార్మెన్స్ అందించే ఇంజిన్‌లకు బెస్ట్.

సెమీ-సింథటిక్ : బ్యాలెన్స్ పర్ఫార్మెన్స్, అధిక ఖర్చు

ఫుల్ సింథటిక్ : హై పర్ఫార్మెన్స్ లేదా సుదూర రైడర్లకు బెస్ట్

8. వాడకపోతే ఇంజిన్ ఆయిల్ గడువు ముగుస్తుందా?

అవును. ఇంజిన్‌లో ఉపయోగించని ఆయిల్ కూడా తేమ, ఉష్ణోగ్రత మార్పుల కారణంగా క్షీణిస్తుంది. వాడకంతో సంబంధం లేకుండా ప్రతి 3 నెలల నుంచి 4 నెలలకు ఒకసారి ఇంజిన్ ఆయిల్‌ను మార్చడం మంచిది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel