TECNO Spark Go 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి శుభవార్త.. భారత మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఈ హ్యాండ్‌సెట్ 50MP బ్యాక్ కెమెరా(TECNO Spark Go 5G) సెన్సార్, 6000mAh బ్యాటరీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిగి ఉంది.
ఈ బడ్జెట్ ఫోన్ ధర రూ. 9,999 ఉంటుంది. ఈ ఫోన్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 6nm చిప్‌సెట్‌తో వస్తుంది. ఇందులో 4GB + 128GB మోడల్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్‌ల నుంచి లభ్యమవుతుంది. ఫస్ట్ సేల్ ఆగస్టు 21న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.
TECNO Spark Go 5G : టెక్నో స్పార్క్ గో 5G స్పెసిఫికేషన్లు :
టెక్నో స్పార్క్ గో 5G ఫోన్ 6.74-అంగుళాల (1600 x 720 పిక్సెల్స్) HD+ ఫ్లాట్ LCD డిస్‌ప్లే కలిగి ఉంది. 670 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15పై రన్ అవుతుంది.
Read Also : Realme P4 Pro 5G : రియల్‌మి P4 ప్రో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చంటే?
TECNO Spark Go 5G : ప్రాసెసర్ :
టెక్నో స్పార్క్ గో 5G లో ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 6nm ప్రాసెసర్ ఉంది. దాంతో పాటు Arm Mali-G57 MC2 GPU కలిగి ఉంది. 4GB LPDDR4X ర్యామ్, 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ పెంచుకోవచ్చు.
టెక్నో స్పార్క్ గో 5G కెమెరా సెటప్ :
టెక్నో స్పార్క్ గో 5Gలో సింగిల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, LED ఫ్లాష్ లైట్ ఉన్నాయి. ఈ కెమెరా సెన్సార్ 2K 30fps వద్ద వీడియోను రికార్డ్ చేయగలదు. 5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.
టెక్నో స్పార్క్ గో 5G బ్యాటరీ :
టెక్నో స్పార్క్ గో 5G ఫోన్‌లో 6000mAh బ్యాటరీ ఉంది. 18W ఫాస్ట్ ఛార్జర్ కూడా ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. 3.5mm ఆడియో జాక్ ఉంది.