Redmi 15 5G : రెడ్మి అభిమానులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 19న భారత మార్కెట్లో షియోమీ రెడ్మి 15 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. 6.9-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 చిప్సెట్, 7000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. రెడ్మి 15 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ముందు ఈ ఫోన్ డిజైన్, బ్యాటరీ, కీలక స్పెసిఫికేషన్లకు సంబంధించి కంపెనీ కొన్ని ఫీచర్లను షేర్ చేసింది. ఈ ఫోన్ ఫ్రాస్టెడ్ వైట్, శాండీ పర్పుల్, మిడ్నైట్ బ్లాక్ అనే 3 కలర్ ఆప్షన్లలో రానుంది.
Redmi 15 5G : డిస్ప్లే, డిజైన్ :
రెడ్మి 15 5G ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్క్రీన్ కంటి ఒత్తిడిని తగ్గించేందుకు TUV రైన్‌ల్యాండ్ లో బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ, సిర్కాడియన్ ఫ్రెండ్లీతో సహా మల్టీ సర్టిఫికేట్లను కలిగి ఉండవచ్చు.
పర్ఫార్మెన్స్, హార్డ్‌వేర్ :
హుడ్ కింద, స్మార్ట్‌ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 చిప్సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ రెడ్మి ఫోన్ 16GB వరకు ర్యామ్ ఎక్స్‌టెన్షన్‌తో వస్తుంది.
Read Also : Lava Play Ultra 5G : లావా ఫస్ట్ గేమింగ్ ఫోన్ వస్తోందోచ్.. ఈ నెల 20నే లాంచ్.. AI ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు
Redmi 15 5G : కెమెరా ఫీచర్లు (అంచనా) :
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. రెడ్మి 15 5Gలో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఫ్రంట్ సైడ్ కెమెరా 8MP రిజల్యూషన్ కలిగి ఉండొచ్చు. ఈ రెడ్మి ఏఐ ఎరేస్, ఏఐ స్కై, క్లాసిక్ ఫిల్మ్ ఫిల్టర్లు వంటి ఫీచర్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
Redmi 15 5G : బ్యాటరీ, ఛార్జింగ్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 7,000mAh బ్యాటరీతో వస్తుంది. 33W వైర్డ్ ఛార్జింగ్, 18W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ 55.6 గంటల స్పాటీఫై స్ట్రీమింగ్, 23.5 గంటల యూట్యూబ్ ప్లేబ్యాక్, 17.5 గంటల ఇన్స్టాగ్రామ్ రీల్ వంటి టైమింగ్ కలిగి ఉంటుందని అంచనా. ఈ ఫోన్ డాల్బీ-సర్టిఫైడ్ ఆడియోతో పాటు దుమ్ము, నీటి నిరోధకత కోసం IP64 సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లు నివేదించింది.
ఆండ్రాయిడ్ 15 ఆధారిత (HyperOS)పై Redmi 15 5G రన్ అయ్యే అవకాశం ఉంది. రెండు ఏళ్ల ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుందని భావిస్తున్నారు. అదనపు ఫీచర్లలో జెమిని ఇంటిగ్రేషన్, సర్కిల్ టు సెర్చ్ వంటి టూల్స్ ఉండే అవకాశం ఉంది. మొత్తంమీద, రెడ్మి 15 5G భారీ డిస్ప్లే, బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది. ఆగస్టు 19న భారత మార్కెట్లో మూడు కలర్ ఆప్షన్లలో రానుంది.