Oppo K13 Turbo : ఒప్పో నుంచి సరికొత్త సిరీస్ ఫోన్ వచ్చేసింది. ఒప్పో ఇండియా నుంచి 2 స్పెషల్ అడ్వాన్స్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఒప్పో K13 టర్బో, ఒప్పో K13 టర్బో ప్రోలను లాంచ్ చేసింది. భారత మార్కెట్లో ఇన్-బిల్ట్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ ఫస్ట్ (Oppo K13 Turbo) ఫోన్లలో ఉన్నాయి. లాంగ్ గేమింగ్ 18,000 RPM వద్ద ఫోన్ కూల్ ఉంచుతుంది.
అలాగే, 7,000 mm² వేపర్ చాంబర్, 19,000 mm² గ్రాఫైట్ లేయర్ ద్వారా ఇన్‌యాక్టివిటీ కూలింగ్ అందిస్తుంది. ఒప్పో K13 టర్బో ప్రో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ కలిగి ఉంది. గత జనరేషన్ కన్నా CPUలో 31శాతం మెరుగైన పర్ఫార్మెన్స్ జీపీయూలో 49శాతం మెరుగైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. బేస్ మోడల్ K13 టర్బో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ధర, ఫోన్ ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Oppo K13 Turbo : ఒప్పో K13 టర్బో, K13 టర్బో ప్రో ధర :
ఒప్పో K13 టర్బో ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999, 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.29,999కు పొందవచ్చు. ఈ ఒప్పో ఫోన్ ఆగస్టు 18న అమ్మకానికి వస్తుంది. లాంచ్ ఆఫర్లతో ఈ ఒప్పో ఫోన్ ధర వరుసగా రూ.24,999, రూ.26,999కి తగ్గుతుంది. ఒప్పో K13 టర్బో ప్రో 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.37,999 నుంచి, 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.39,999 నుంచి ప్రారంభమవుతుంది.
Read Also : Vivo V60 : కొత్త వివో V60 వచ్చేస్తోందోచ్.. ఈరోజే లాంచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చంటే?
ఈ కొత్త ఒప్పో ఫోన్ ఆగస్టు 15 నుంచి అమ్మకానికి రానుంది. డిస్కౌంట్ ఆఫర్లతో ఫోన్ ధర వరుసగా రూ.34,999, రూ.36,999 అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్, ఒప్పో వెబ్‌సైట్, కంపెనీ రిటైల్ పార్టనర్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఒప్పో K13 టర్బో ప్రో సిల్వర్ నైట్, పర్పుల్ ఫాంటమ్, మిడ్‌నైట్ మావెరిక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఒప్పో K13 టర్బో నైట్ వైట్, ఫస్ట్ పర్పుల్, మిడ్‌నైట్ మావెరిక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Oppo K13 Turbo : ఒప్పో K13 టర్బో, ఒప్పో K13 టర్బో ప్రో ఫీచర్లు :
ఒప్పో (OPPO K13 Turbo) సిరీస్‌లోని ఈ 2 ఫోన్‌లు 6.8-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. గేమింగ్, మల్టీమీడియా ఆకట్టుకునేలా ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా ఒప్పో K13 టర్బో ప్రోలో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్ ఉంది.
ఒప్పో K13 టర్భోలో మీడియాటెక్ డైమన్షిటీ 8450 చిప్‌సెట్ ఉంది. పవర్‌ఫుల్ మల్టీ టాస్కింగ్, మెరుగైన పవర్ కెపాసిటీని అందిస్తుంది. మెమరీ పరంగా టర్బో ప్రోలో LPDDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్ (512GB వరకు) ఉన్నాయి. అయితే, ఒప్పో టర్బో మోడల్‌లో LPDDR5 ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ ఉన్నాయి.
కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. బ్యాటరీ పరంగా, రెండు ఫోన్‌లు పవర్‌ఫుల్ 7000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇన్-బిల్ట్ యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్, 18,000 RPM వద్ద రన్ అవుతుంది. లాంగ్ గేమింగ్ సెషన్‌ల సమయంలో ఫోన్‌ను కూలింగ్ ఉంచుతుంది. కనెక్టివిటీలో 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC ఫీచర్లతో పాటు IPX8/IPX9 వాటర్-రెసిస్టెంట్ రేటింగ్ ఉన్నాయి.