Moto G86 Power : కొత్త మోటో G86 పవర్ స్మార్ట్‌ఫోన్ వస్తోంది.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 53 గంటల బ్యాకప్.. ధర చాలా తక్కువ..!

Updated on: July 25, 2025

Moto G86 Power : ప్రముఖ టెక్ కంపెనీ మోటోరోలా జూలై 30న బడ్జెట్ సెగ్మెంట్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ మోటో G86 పవర్‌ లాంచ్ చేయబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6720mAh బ్యాటరీతో వస్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. 53 గంటల బ్యాకప్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

6.7-అంగుళాల డిస్‌ప్లే, ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, 50MP సోనీ LYTIA600 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2 స్టోరేజ్, 3 కలర్ ఆప్షన్‌లలో అందిస్తోంది. కాస్మిక్ స్కై, గోల్డెన్ సైప్రస్, స్పెల్ బౌండ్ ఉన్నాయి. భారతీయ మార్కెట్లో ఈ మోటో ఫోన్ ప్రారంభ ధర రూ. 20వేల నుంచి రూ. 32వేల వరకు ఉంటుంది.

Moto G86 Power : మోటో G86 ఫోన్ పవర్ స్పెసిఫికేషన్లు :

డిస్‌ప్లే :
మోటో G86 ఫోన్ పవర్ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. గరిష్ట ప్రకాశంతో 4500 నిట్స్, రిజల్యూషన్ 2712 x 1220 పిక్సెల్‌, డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా పొందుతుంది.

Advertisement

కెమెరా :
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. మోటో G86 పవర్ 50MP సోనీ LYTIA600 ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

Read Also : Realme 15 Pro 5G : రియల్‌మి కొత్త 5G ఫోన్ అదుర్స్.. ఏఐ ఫీచర్ల కోసమైన కొనేసుకోండి.. ధర కూడా చాలా తక్కువే..

ర్యామ్, స్టోరేజ్ :
మోటో G86 ఫోన్ పవర్ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ 128GB, 256GB స్టోరేజ్‌తో 8GB సింగిల్ ర్యామ్ ఆప్షన్ అందిస్తోంది. ఈ ఫోన్ మొత్తం 3 కాంబినేషన్‌లలో రావచ్చు. ర్యామ్ 16GB వరకు స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించవచ్చు.

Advertisement

OS ప్రాసెసర్ :
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టా కోర్ మీడియాటెక్ డైమన్షిటీ 7400 ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

బ్యాటరీ, ఛార్జింగ్ :
పవర్ బ్యాకప్ కోసం మోటో G86 పవర్ స్మార్ట్‌ఫోన్ 33W టర్బో ఛార్జింగ్‌తో 6720mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ రెండు రోజుల బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

ఇతర ఫీచర్లు :
కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఈ మోటో ఫోన్‌లో నెట్‌వర్క్ బ్యాండ్ 2G నుంచి 5G, బ్లూటూత్ 5.4, Wi-Fi, GPS, ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ మోటో ఫోన్‌లో యాంబియంట్ లైట్, ఓసిల్లోమీటర్, గైరోస్కోప్, SAR సెన్సార్, మాగ్నెటోమీటర్ (ఇ-కంపాస్) సెన్సార్ ఉన్నాయి. అంతేకాదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆన్-స్క్రీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel