Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

iQOO 15R Launch : 7600mAh భారీ బ్యాటరీతో కొత్త iQOO 15R వచ్చేసింది, ఖతర్నాక్ ఫీచర్లు, ధర ఎంతో తెలిస్తే ఎగిరిగంతేస్తారు

iQOO 15R Launched in India

iQOO 15R Launched in India

iQOO 15R Launch : ఐక్యూ అభిమానులకు పండగే. భారత మార్కెట్లోకి కొత్త iQOO 15R ఫోన్ వచ్చేసింది. వివో సబ్-బ్రాండ్ నుంచి ఈ కొత్త ఐక్యూ ఫోన్ 1.5K 144Hz AMOLED స్క్రీన్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్ ద్వారా పవర్ పొందుతుంది.

వన్‌ప్లస్ 15కి కూడా ఇదే చిప్ సెట్ పవర్ అందిస్తుంది. ఐక్యూ 15R ఫోన్ 50MP సోనీ LYT-700V సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఐక్యూ ఫోన్ 7,600mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది.

iQOO 15R Launch : భారత్‌లో iQOO 15R ధర ఎంతంటే? :

భారత మార్కెట్లో ఐక్యూ 15R ధర 8GB RAM, 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్ రూ. 44,999 నుంచి లభ్యమవుతుంది. 12GB + 256GB, 12GB + 512GB వేరియంట్లలో కూడా లభిస్తుంది. ఈ ఫోన్ల ధర వరుసగా రూ. 47,999, రూ. 52,999 నుంచి లభ్యమవుతాయి. ఐక్యూ 15R ఫోన్ డార్క్ నైట్, ట్రయంఫ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అమెజాన్, ఐక్యూ ఇండియా స్టోర్, అలాగే వివో రిటైల్ స్టోర్లలో ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.

Advertisement

ముందస్తు కొనుగోలుదారులు మార్చి 2న ఉదయం 10 గంటలకు ఐక్యూ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. సాధారణ సేల్ మార్చి 3న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా వినియోగదారులు HDFC, Axis బ్యాంక్ క్రెడిట్, డెబిట్, ఈఎంఐ లావాదేవీలపై రూ.4,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఐక్యూ 15R కొనుగోలుతో పాటు రూ.1,899 విలువైన ఫ్రీ ఐక్యూ/వివో TWSని కూడా కంపెనీ అందిస్తోంది.

iQOO 15R Launch : ఐక్యూ 15R ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :

ఐక్యూ 15R డ్యూయల్-సిమ్ (నానో + నానో) ఆండ్రాయిడ్ 6 ఆధారంగా OriginOS 16పై రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌కు 4 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు, 6 సంవత్సరాల సేఫ్టీ అప్ డేట్స్ లభిస్తాయి.

120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల 1.5K (1,260 x 2,750 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లే, 5,000 నిట్స్ వరకు లోకల్ పీక్ బ్రైట్‌నెస్, HDR10+ సర్టిఫికేషన్, 4,320Hz PWM డిమ్మింగ్ రేట్‌తో వస్తుంది. వివో సబ్-బ్రాండ్ ఈ కొత్త ఫోన్ ఫ్రేమ్ ఇంటర్‌పోలేషన్ కారణంగా గేమింగ్ సమయంలో 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది.

Advertisement

ఐక్యూ 15R స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 12GB వరకు LPDDR5x ర్యామ్, 512GB వరకు UFS 4.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్, అడ్రినో 826 జీపీయూతో వస్తుంది. కెమెరాల విషయానికొస్తే.. OISతో 50MP సోనీ LYT-700V ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ కెమెరా ఉంది.

కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే..

5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 6, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. కొలతలు 157.61 x 74.42 x 7.90mm, బరువు 202 గ్రాములు (డార్క్ నైట్ వేరియంట్). ఐక్యూ 15R IP68 + IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ అందిస్తుంది. ఐక్యూ నుంచి ఈ మిడ్-ఫ్లాగ్‌షిప్ ఫోన్ 7,600mAh లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

Advertisement
Exit mobile version