Loan on PAN : మీ పాన్ కార్డుపై ఇంకెవరైనా లోన్ తీసుకున్నారా? ఇలా చెక్ చేయండి.

Updated on: July 20, 2025

Loan on PAN Card : ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్ లోన్ మోసాలు పెరిగిపోతున్నాయి. మీకు తెలియకుండా మీ వ్యక్తిగత ఐడెంటిటీతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కేసులు (Loan on PAN) వేగంగా పెరుగుతున్నాయి. మీరు వేరొకరి ఐడీని ఉపయోగించి సిమ్ కార్డ్ పొందడం గురించి విని ఉంటారు. కానీ, మీ పాన్ కార్డుపై మరొకరు లోన్ తీసుకుంటారని మీరు ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి పరిస్థితిలో మీ పాన్ కార్డును ఉపయోగించి మీ పేరుతో మరొకరు రుణం తీసుకున్నారో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

వాస్తవానికి, మీ పాన్ నేరుగా మీ క్రెడిట్ రిపోర్టుకు లింక్ అయి ఉంటుంది. తద్వారా తీసుకున్న ఏదైనా రుణం, మీ సమ్మతితో లేదా మీ సమ్మతి లేకుండా అయినా మీ క్రెడిట్ రేటింగ్, భవిష్యత్తులో లోన్ తీసుకోవడంపై ప్రభావం పడుతుంది. మీ పాన్ కార్డును వేరే ఎవరైనా ఉపయోగించారో లేదో ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.. ఒకవేళ ఉంటే మీరు ఏమి చేయాలంటే?

Loan on PAN : మీ క్రెడిట్ రిపోర్టును క్రమం తప్పకుండా చెక్ చేయండి :

మీ పాన్ కార్డుతో ఏదైనా రుణం తీసుకున్నారో లేదో తెలుసుకోవడానికి సులభమైన మార్గం.. మీ క్రెడిట్ రిపోర్టు చెక్ చేయడమే. CIBIL, Experian, Equifax, CRIF హై మార్క్ వంటి క్రెడిట్ బ్యూరోలు మీ పేరు మీద తీసుకున్న అన్ని రుణాలు, క్రెడిట్ కార్డుల రికార్డును ఉంచుతాయి. మీరు వారి వెబ్‌సైట్‌ను విజిట్ చేసి మీ పాన్ కార్డు, మొబైల్ నంబర్‌ను వెరిఫై చేయడం ద్వారా ఫ్రీ క్రెడిట్ రిపోర్టును అభ్యర్థించవచ్చు. ఈ రిపోర్టులో ఏవైనా తెలియని అకౌంట్లు లేదా లోన్ రికార్డుల కోసం చెక్ చేయండి.

Advertisement

క్రెడిట్ రిపోర్టులో ఈ సంకేతాలపై నిఘా పెట్టండి :
మీ రిపోర్టును పరిశీలించేటప్పుడు.. ఎప్పుడూ దరఖాస్తు చేసుకోని రుణాలు లేదా క్రెడిట్ కార్డులను చెక్ చేయండి. రాంగ్ బ్యాంకు అకౌంట్ నంబర్లు, తెలియని రుణదాత పేర్లు లేదా ఆమోదించని కొత్త ‘హార్డ్ ఎంక్వైరీలు’ (రుణదాత మీ క్రెడిట్‌ను చెక్ చేసినప్పుడు) తెలుస్తుంది.

మీ పాన్ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేసి ఉండవచ్చనే సంకేతాలుగా చెప్పవచ్చు. మీరు ఇలాంటి అనేక రికార్డులను చూసి మీ క్రెడిట్ మరింత దెబ్బతినకుండా ముందుగానే జాగ్రత్రలు తీసుకోవచ్చు.

Loan on PAN : మీకు మోసపూరిత లోన్ వస్తే ఏం చేయాలి? :

మీరు మోసపూరిత రుణాన్ని పొందినట్లయితే.. వెంటనే రుణదాతకు క్రెడిట్ బ్యూరోకు రిపోర్టు చేయండి. చాలా కేసులను క్రెడిట్ బ్యూరోలు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయవచ్చు. మీరు ఐడెంటిటీ ప్రూఫ్, సంబంధిత రుణం వాస్తవాలు, సంతకం చేసిన అఫిడవిట్‌ను అందించాల్సి ఉంటుంది. అలాగే, పాన్ దుర్వినియోగ రుజువుతో పాటు మీ స్థానిక పోలీసుల సైబర్ క్రైమ్ సెల్‌లో ఫిర్యాదు చేయండి.

Advertisement

Read Also : Driving Licence : పేపర్ డాక్యుమెంట్లు అక్కర్లేదు.. మీ డ్రైవింగ్ లైసెన్స్, RC మీ మొబైల్‌లోనే.. పోలీసులు అడిగితే ఇవే చూపించొచ్చు..!

భవిష్యత్తులో పాన్ దుర్వినియోగాన్ని ఎలా నివారించాలి? :

  • గుర్తుతెలియని సైట్‌లు, యాప్‌లు లేదా వాట్సాప్ ఫార్వార్డ్‌లలో మీ పాన్ కార్డ్ నంబర్‌ను ఎప్పుడూ షేర్ చేయొద్దు.
  • బహిరంగంగా లేదా ఏదైనా ముఖ్యమైన పని లేకుండా ఎవరికీ పాన్ కార్డు ఇవ్వవద్దు.
  • మీ పాన్ కార్డును పోగొట్టుకుంటే.. రీప్రింట్ కోసం అప్లయ్ చేసుకోండి.
  • రాబోయే కొన్ని నెలల్లో మీ క్రెడిట్ రిపోర్టును చెక్ చేయండి.
  • బ్యాంకు అకౌంట్లకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను వాడండి.
  • మీ PAN కార్డుకి లింక్ చేసిన లోన్ లేదా క్రెడిట్ అప్లికేషన్లకు SMS/ఇమెయిల్ నోటిఫికేషన్లను యాక్టివేట్ చేయండి.

Loan on PAN : తరచుగా అడిగే ప్రశ్నలివే (FAQs) :

1. మీ పాన్‌‌కు సంబంధించిన లోన్ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో చెక్ చేయవచ్చా? :
Ans : CIBIL, Experian లేదా CRIF వంటి ఏదైనా ప్రధాన క్రెడిట్ బ్యూరోల సైట్‌ను విజిట్ చేయండి. మీ PAN నంబర్‌ను ఎంటర్ చేసి మీ క్రెడిట్ రిపోర్టును అభ్యర్థించండి. మీ పేరు మీద తీసుకున్న అన్ని లోన్లు, క్రెడిట్ కార్డులను చూపుతుంది.

2. ఎవరైనా నా పాన్‌ కార్డుతో చట్టవిరుద్ధంగా లోన్ పొందితే ఏం చేయాలి? :
Ans : మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. మీకు అవసరమైనప్పుడు లోన్ పొందలేరు. అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు వెంటనే క్రెడిట్ బ్యూరోలో కేసు రిజిస్టర్ చేయాలి, రుణదాతకు ఫిర్యాదు చేయాలి. పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

Advertisement

3. మీ క్రెడిట్ రిపోర్టును ఎన్నిసార్లు చెక్ చేయొచ్చంటే? :
Ans : మీరు ప్రతి 3 నెల నుంచి 6 నెలలకు ఒకసారి మీ క్రెడిట్ రిపోర్టు చెక్ చేయొచ్చు. మీ క్రెడిట్ రిపోర్టును క్రమం తప్పకుండా చెక్ చేయడం ఏదైనా మోసాన్ని ముందుగానే గుర్తించవచ్చు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel